28 కోట్లు ఖ‌ర్చు పెట్టి క్రిస్మ‌స్ పండుగ చేసుకుంటాడ‌ట‌..!

Millionaire: ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. జీవితం త‌ల‌కిందులు అయిపోయి ఎంతో న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. మ‌రికొంద‌రు బాగానే బాగుప‌డ్డారు. ఇలా ఎవ‌రి జీవితాల‌తో వారు బిజీ అయిపోయారు. అయితే పై ఫోటోలో క‌నిపిస్తున్న ఈ కోటీశ్వరుడు మాత్రం ఈ ఏడాది క్రిస్మ‌స్‌ను 28 కోట్లు అంటే దాదాపు 2.8 మిలియ‌న్ పౌండ్లు ఖ‌ర్చుపెట్టి క్రిస్మ‌స్ పండుగ జ‌రుపుకుంటున్నాను అంటున్నాడు. సాధార‌ణంగా అయితే అంత‌కంటే ఎక్కువే ఖ‌ర్చు పెట్టేవాడట‌. కానీ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లు లేక బాధ‌ప‌డ‌టం చూసి ఈసారికి 28 కోట్ల‌తోనే పండుగ జ‌రుపుకుంటాన‌ని అంటున్నాడు.

ఇంత‌కీ ఇత‌ను ఎవ‌రంటే…బ్యారీ డ్రెవిట్. బ్రిట‌న్‌కి చెందిన బ్యారీ త‌న గే పార్ట్‌న‌ర్‌తో పిల్ల‌ల్ని క‌న్న తొలి వ్య‌క్తిగా పాపుల‌ర్ అయ్యాడు. ఇత‌నికి స‌రోగ‌సీ సెంట‌ర్, మెడిక‌ల్ రీసెర్చ్ కంపెనీ ఉంది. బ్రిట‌న్‌లోని కోటీశ్వ‌రుల‌లో ఇత‌ను ఒక‌డు. స‌రోగ‌సీ ద్వారా దాదాపు 8 మందికి తండ్రి అయిన బ్యారీ.. త‌న పిల్ల‌ల‌కు రోలెక్స్ వాచీలు, ఆడి కార్లు క్రిస్మ‌స్ కానుక‌గా ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ట‌. త‌న‌కోసం ఆల్రెడీ రూ.1.6 కోట్లు పెట్టి ఆడి కారును కొని పెట్టేసుకున్నాడు. ఈ విష‌యాన్ని బ్యారీ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.