Papaya: పచ్చిగా తిన్నా మంచిదేనట..!
Papaya: బొప్పాయి అనగానే మనకు నోరూరే పండు మాత్రమే గుర్తొస్తుంది. బొప్పాయి పండు అందరూ తినేదే. కానీ పచ్చి బొప్పాయి తినడం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును.. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయట. పచ్చి బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
*పచ్చి బొప్పాయిలో పాపైన్ అనే ఎన్జైం (కిణ్వం) ఉంటుంది. దీని వల్ల జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు ఏమైనా ఉంటే అవిపోతాయి.
*బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
*అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. (papaya)
*పీచు, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.
*బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.
*కీళ్లవాతం వంటి సమస్యలు దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. (papaya)
*పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి రాకుండా చేసే శక్తి కూడా పచ్చి బొప్పాయిలో ఉంది.
ఏదైనా తిండి విషయంలో కానీ వ్యాయామం విషయంలో కానీ వైద్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.