Udaipur: దేశాన్ని వ‌ణికించిన ద‌ర్జీ హ‌త్య వెనుక‌ BJP నేత‌లు..?

Udaipur: గ‌తేడాది జూన్ 22న ఓ ద‌ర్జీ క‌న్న‌య్య లాల్ (kanhaiya lal) దారుణ హ‌త్య యావ‌త్ భార‌త‌దేశాన్ని వ‌ణికించింది. దుకాణం తెరిచుకుని త‌న ప‌ని తాను చేసుకుంటున్న క‌న్న‌య్య‌ను ఇద్ద‌రు ముస్లిం వ్య‌క్తులు దుస్తులు కుట్టించుకోవడానికి వ‌చ్చిన‌ట్లు న‌టించి దారుణంగా క‌త్తుల‌తో పొడిచి చంపేసారు. ఇందుకు కార‌ణం క‌న్న‌య్య లాల్ BJP నేత నుపూర్ శ‌ర్మ (nupur sharma) మ‌హ‌మ్మ‌ద ప్ర‌వ‌క్త‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్ట‌డ‌మే. ఈ పోస్ట్ చూసిన గౌస్ మ‌హమ్మ‌ద్, రియాద్ అట్టారీ అనే ఇద్ద‌రు ముస్లిం వ్య‌క్తులు క‌న్న‌య్య షాప్‌కి వెళ్లి దారుణంగా చంప‌డ‌మే కాదు చంపిన త‌ర్వాత వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ పరార‌య్యారు.

అయితే నిందితుల‌ను ఇప్ప‌టివ‌ర‌కు అదుపులోకి తీసుకున్నారో లేదో కూడా తెలీదు. అయితే క‌న్న‌య్య హ‌త్య వెనుక BJP ఉన్న‌ట్లు రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ (ashok gehlot) ఆరోపిస్తున్నారు. ఆయ‌న ఇలా ఆరోపించ‌డానికి కార‌ణం మొన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) కాంగ్రెస్ ఉగ్ర‌వాదుల వైపే ఉంటుంది అని వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ద‌ర్జీ హ‌త్య గురించి ప్ర‌స్తావిస్తూ రాజ‌స్థాన్‌లో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని అన్నారు. దీనిపై గెహ్లోత్ స్పందిస్తూ.. ద‌ర్జీని హ‌త్య చేసిన నిందితులు ఈ హ‌త్య జ‌ర‌గ‌డానికి ముందే మ‌రో నేరం కింద అరెస్ట్ అయ్యార‌ని.. హ‌త్య జ‌ర‌గ‌డానికి కొన్ని రోజుల ముందే కొంద‌రు BJP నేత‌లు స్టేష‌న్‌కి వెళ్లి మ‌రీ వారిని విడిపించార‌ని షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసారు. (udaipur)

ఆ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే గెహ్లోత్ ఉద‌య్‌పూర్ బ‌య‌లుదేరారు. కానీ మోదీ ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో ఉన్నారు. అంతేకాదు.. ఈ కేసుని రాష్ట్రానికి సంబంధించిన స్పెష‌ల్ ఆప‌రేషన్స్ గ్రూప్ (SOG) ద్వారా విచార‌ణ చేయిస్తామంటే కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్దు నేష‌న‌ల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) ద్వారా అయితే త్వ‌ర‌గా కేసు తేలిపోతుంది అని తెలిపింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసులోని నిందితుల‌ను NIA ప‌ట్టుకున్నారో లేదో కూడా ఎలాంటి క్లారిటీ లేదు.