“నేను ప‌వ‌న్‌తో న‌టించ‌డంలేదు”

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, డైరెక్టర్​ హరీష్​ శంకర్​ కాంబినేషన్లో ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ ఎప్పుడు ప్రారంభమవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​. ఇక హరీష్​‌‌, పవన్​ కల్యాణ్​ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్​ సింగ్​ సినిమా బ్లాక్​ బస్టర్​ హిట్​ అవడంతో ఈ సినిమాపై అభిమానులతోపాటు పరిశ్రమలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ విషయం బయటకొచ్చింది.

భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. అయితే ఇప్పటికే ఓ హీరోయిన్​గా పూజా హెగ్డే పేరును ప్రకటించేంది చిత్రబృందం. ఇక ఇప్పుడు రెండో హీరోయిన్​ని కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. మలయాళ బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్.. సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింద‌ని పుకార్లు వ‌చ్చాయి. అయితే దీనిపై మాళ‌విక స్పందించారు. త‌న‌ను ఈ సినిమా గురించి ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని, తాను ఉస్తాద్‌లో న‌టించ‌డంలేద‌ని తెలిపారు​. తాను ప‌వ‌న్‌కు వీరాభిమానినని, త్వ‌ర‌లో తెలుగులో డెబ్యూ చేయాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నాన‌ని పేర్కొన్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. గతంలో హరీష్ శంకర్ తో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రానికి పని చేసిన అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నారు. రామ్- లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు రీచ్ అయ్యేలా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారట.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా ప్రజలతో మమేకమవుతూనే సినిమాలనూ చకచకా చేసేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న వినోధయ సీతమ్ తెలుగు రీమేక్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పవన్‌ కల్యాణ్‌ మరోవైపు క్రిష్‌ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లుతోపాటు సుజిత్ దర్శకత్వంలో OG ప్రాజెక్ట్‌లను కూడా చేస్తున్న విషయం తెలిసిందే.