Telangana Elections: BRSలోకి భారీ చేరికలు.. జనసేన ప్రభావమేనా?
Telangana Elections: BJP, జనసేన (janasena) కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూకట్పల్లి స్థానాన్ని జనసేనకు ఇవ్వకూడదని BJP కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్ పల్లి కార్యాలయం వద్ద BJP కార్యకర్తల నిరసన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ BJP కార్పొరేటర్ అభ్యర్థి, మేడ్చల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి మంత్రి కేటీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వీరితో పాటుగా నాయకులు మేడ్చల్ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గుండాల జగదీష్ బాబు, కిసాన్ మోర్చా డివిజన్ ప్రెసిడెంట్, మరి కొందరు పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నుండి..
మరోపక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని సీఎం KCR సమక్షంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త జైపాల్ రెడ్డి, కరీంనగర్ పట్టణానికి చెందిన కొందరు కార్పొరేటర్లు ఈరోజు BRS పార్టీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని అన్నారు కానీ ఆయన కూడా BRS కండువా కప్పుకున్నారు.