Jaggery: ఏ ర‌క‌మైన బెల్లం మంచిది?

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఐర‌న్ (iron) పుష్క‌లంగా ఉంటుంది. చెక్క‌ర‌కు బ‌దులు బెల్లం (jaggery) వేసుకుంటే ఎంతో మంచిద‌ని వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే బెల్లంలో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. అస‌లు ఏ బెల్లం మంచిదో తెలుసుకుందాం.

ఖ‌ర్జూర బెల్లం (date palm jaggery)

రిఫైన్ చేయ‌ని బ్రౌన్ షుగ‌ర్‌నే బెల్లం అంటారు. ఖ‌ర్జూరాల నుంచి త‌యారుచేసే బెల్లం కూడా ఉంటుంది. ఇది చాక్లెట్ రుచిని క‌లిగి ఉంటుంది. ఈ ఖ‌ర్జూన బెల్లాన్ని ఎక్కువ‌గా వెస్ట్ బెంగాల్‌లో వాడ‌తారు. ఖ‌ర్జూరాల నుంచి జ్యూస్ బ‌య‌టికి తీసి దానిని మ‌రిగించి చేత్తో త‌యారుచేస్తారు.

కొబ్బ‌రి బెల్లం (coconut jaggery)

కొబ్బ‌రితో కూడా బెల్లాన్ని త‌యారుచేస్తారు. కొబ్బ‌రినీళ్ల నుంచి త‌యారుచేసే ఈ బెల్లాన్ని గోవాలోని రెస్టారెంట్ల‌లో ఎక్కువ‌గా వాడుతుంటారు. ఇది పిర‌మిడ్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీనిని పిర‌మిడ్ బెల్లం అని కూడా పిలుస్తారు.

చెరుకు బెల్లం (sugarcane jaggery)

ఇది మ‌నం రోజూ తినే బెల్ల‌మే. చెరుకు ర‌సం నుంచి తయారుచేస్తారు. పల్లీ చిక్కీ, పాయ‌సం, బియ్యం పాయ‌సం వంటి వంట‌కాల్లో దీనిని ఎక్కువ‌గా వాడుతుంటాం.

ఏ బెల్లం మంచిది?

ఏ బెల్లమైనా స‌రే అందులో విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. కాక‌పోతే వీటిలో ఉత్త‌మ‌మైన‌ది ఏది అంటే ఖ‌ర్జూర బెల్లం అని చెప్తారు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా దీనిని చ‌లికాలంలో ఎక్కువ‌గా తీసుకుంటే కాలానుగుణ వ‌చ్చే రోగాలు ద‌రిచేర‌వు. రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. కానీ ఎక్కువ‌గా తింటే మాత్రం అన‌ర్థాలకు దారితీస్తుంది అన్న విష‌యాన్ని మాత్రం మ‌ర్చిపోకండి.

ఇది కేవ‌లం స‌మాచారం కోసం మాత్ర‌మే ఇచ్చిన వార్త‌. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై అవ‌గాహ‌న కోసం వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.