Kodali Nani: జనసేన కాదు.. జనసున్నా..!
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జీవితాంతం జైల్లోనే ఉంటారని అన్నారు నేత YSRCP కొడాలి నాని (kodali nani). చంద్రబాబు కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. నారా లోకేష్ (nara lokesh) అసమర్ధుడు కాబట్టే ఈరోజు నారా భువనేశ్వరి (nara bhuvaneswari) రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందని అన్నారు.
అసలు నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మళ్లీ నిజం గెలవాలి (nijam gelavali) అనే కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారో తనకు అర్థంకావడంలేదని తెలిపారు. ఇక జనసేన విషయానికొస్తే పవన్ కళ్యాణ్ (pawan kalyan) 2014లో కూడా తెలుగు దేశం పార్టీతోనే (TDP) కలిసి ఉన్నారని ఇప్పుడు జనసేన (janasena) కాస్తా జనసున్నాగా మారిందని వెటకారంగా మాట్లాడారు.