Weight Loss: ఎంత సేపు నడవాలి?
Walking: వ్యాయామాల్లో ది బెస్ట్ ఏది అంటే వాకింగ్ అనే అంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు ప్రశాంతంగా చేసుకోగలిగే ఏకైక వర్కవుట్ వాకింగే. మరి బరువు తగ్గడానికి (weight loss) కూడా ఉపయోగపడే ఈ వాకింగ్ విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొందరు రోజుకు 5000 అడుగుల వేస్తుంటారు. మరికొందరు ఏకంగా 10 వేల అడుగులు వేస్తారు. అసలు బరువు తగ్గేందుకు రోజుకు ఎంత సేపు నడవాలో తెలుసుకుందాం.
మాయో క్లీనిక్ (mayo clinic) వెల్లడించిన నివేదికలో రోజుకు అరగంట పాటు బ్రిస్క్ వాకింగ్ చేస్తే 150 కేలొరీలు కరుగుతాయట. ఎంత ఎక్కువ సేపు ఎంత వేగంగా నడిస్తే అన్ని కేలొరీలు ఖర్చు అవుతాయి. అమెరికన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి వారంలో 150 నిమిషాలు వర్కవుట్స్ చేస్తే ఫిట్‌గా ఉంటారట. వాకింగ్ బరువును తగ్గించడంలో కూడా సహాయ పడుతుంది. బిజీగా ఉండటం వల్ల కొందరు జిమ్‌కి వెళ్లే బదులు ఇంట్లోనే వర్కవుట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక అది కూడా చేయలేని వారు హ్యాపీగా కనీసం వాకింగ్ అయినా చేస్తుంటారు. మరి వాకింగ్ చేసేందుకు కూడా సమయం లేదు అంటే లేనిపోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు అని అర్థం. (weight loss)
శారీరక వ్యాయామం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దరిచేరవు. వాకింగ్ కూడా ఎన్నో లాభాలను ఇస్తుంది. కాసేపు వాకింగ్ చేసి చూడండి. కుదిరితే ఒంటరిగా చేసేందుకు ప్రయత్నించండి. మీతో మీరు సమయాన్ని గడిపినట్లు అవుతుంది. వాకింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు అర్థ్‌రైటిస్ కూడా తగ్గుతాయి. వాకింగ్ వల్ల కీళ్లు బలపడతాయి. ఎందుకంటే నడుస్తున్నప్పుడు మన కాళ్లు కదులుతాయి కాబట్టి ఎముకల మధ్య జిగురు లూబ్రికేషన్‌లా పనిచేస్తుంది. దీని వల్ల ఎక్కడికక్కడ పట్టేయడాలు, నొప్పులు కలగడాలు ఉండవు. కాబట్టి రోజూ ఒక అరగంట పాటు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. (weight loss)
మీకు ఏవైనా అనుమానాలు, అనారోగ్య సమస్యలు వంటివి ఉంటే వాకింగ్, వర్కవుట్స్ విషయంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం