Relationship: వన్ సైడ్ లవ్.. మర్చిపోలేకపోతున్నారా?
Relationship: బ్రేకప్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది (relationship). ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకుని విడిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇది ఒక రకమైన బాధ అయితే.. మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మన ప్రేమను రిజెక్ట్ చేస్తే అది మరో రకమైన పెయిన్. ఇంకొందరైతే మరీనూ.. అవతలి వ్యక్తి ప్రేమను రిజెక్ట్ చేస్తే ఎమెషనల్ బ్ల్యాక్ మెయిల్ చేస్తుంటారు. దాంతో వారు భయపడి ఇష్టం లేకపోయినా నో చెప్తే ఏమన్నా చేసుకుంటారేమో అని అతి కష్టం మీద యస్ చెప్తారు. ఆ విషయం ప్రేమించేవారికి తెలీక ప్రేమలో తేలిపోతున్నాం అనుకుంటారు. నిజానికి ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు. ఇద్దరి వైపు నుంచి సమానమైన ప్రేమ ఉంటేనే కదా ఆ ప్రేమకు విలువ. అలాంటి బంధాలు దృఢంగా ఉంటాయి కూడా. (relationship)
ఒకవేళ మీరు ఇష్టమైన వ్యక్తులు నో అంటే బలవంతంగా యస్ చెప్పించుకోవాలని అస్సలు చూడకండి. వారంతట వారు వస్తే పర్వాలేదు. అలాకాకుండా మీరు విశ్వ ప్రయత్నాలు చేసి ఫోర్స్‌ఫుల్‌గా మీ ప్రేమను ఒప్పించుకుంటే నష్టపోయేది మీరే. రేపు ఏదైనా గొడవొస్తే.. నువ్వే ప్రపోజ్ చేసావ్.. నేను నో చెప్పినా కూడా బలవంతంగా ఒప్పించావ్. నీ వల్లే ఇదంతా అంటారు. ఆ మాటలు తూటాల్లా తగులుతుంటాయి.
మరి ఏం చేయాలి?
మీరు ఎవరినైనా ఇష్టపడితే.. ఫస్ట్ అది ప్రేమో లేక ఆకర్షణో తెలుసుకోండి. ఒక క్లారిటీ వచ్చాక మీ మనసులో మాటను క్లియర్‌గా చెప్పేయండి. ఏదీ దాచకండి. లేదంటే మొదటికే మోసం. మీ ప్రేమను చెప్పాక.. లక్కీగా అవతలి వారికి ఓకే అయితే అంతా హ్యాపీనే. లేదంటే ఇట్స్ ఓకే నా ఫీలింగ్ చెప్పాను అని వదిలేయండి. ఒకవేళ వారితో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకున్నా కూడా అలాంటి వద్దు అనే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకవైపు ప్రేమిస్తూ మరోవైపు స్నేహంగా ఎలా ఉంటారు? ఎంత కష్టంగా ఉంటుందో కదా..! (relationship)
ఎలా బయటపడాలి?
ప్రేమను రిజెక్ట్ చేస్తే బాధ కచ్చితంగా ఉంటుంది. కొందరైతే నిమిషాల్లో పాజిటివ్‌గా తీసుకుని లైట్ తీసుకుంటారు. అలా అందరికీ వీలు పడదు. ఒకవేళ బాధగా ఉంటే బాధపడండి. తప్పు లేదు. ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి. జాబ్ చేస్తున్నవారు ఎక్కువ సేపు ఆఫీస్‌లో ఉండేందుకు ప్రయత్నించండి. అక్కడ కొలీగ్స్ ఉంటారు కాబట్టి వారితో మీ వర్క్ లేదా కబుర్లు చెప్పండి. మిమ్మల్ని రిజెక్ట్ చేసినవారికి సంబంధించిన ఒక్క ఫిజికల్ మెమొరీని కూడా మీ దగ్గర పెట్టుకోకండి. ఎందుకంటే లక్కీగా మీరు వారిని మర్చిపోయినా వారికి సంబంధించిన ఫోటోలు, వస్తువులు మీ దగ్గరే ఉంటే మళ్లీ పాత విషయాలు గుర్తొస్తాయి.
ఏ బాధ నుంచైనా కోలుకోవడానికి సమయం పడుతుంది. పట్టనివ్వండి. రేపటికి రేపే అంతా మర్చిపోవాలి అంటే అవ్వదు కదా. మీ పనిలో మీరు నిమగ్నం అయితే.. మీ మెదడు, మనసు కూడా కొన్ని విషయాలు మర్చిపోవడానికి సాయం చేస్తాయి. ఆల్ ది బెస్ట్..!