వీటిని మళ్లీ వేడి చేస్తున్నారా..?
కొన్ని రకాల ఆహార పదార్థాలను (foods) మళ్లీ వేడి చేయకూడదని అంటున్నారు ఆహార నిపుణులు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.
పుట్టగొడులు (mushrooms)
పుట్టగొడులను మళ్లీ వేడి చేస్తే అవి రబ్బర్‌లా మారిపోయి టేస్ట్ పోతుంది. ఒకవేళ తప్పక వేడి చేయాల్సిన పరిస్థితి వస్తే 10 సెకన్ల కంటే ఎక్కువ వేడి చేయకూడదు.
అన్నం (rice)
అన్నం వండుకున్నప్పుడే వేడి వేడిగా అప్పటికప్పుడు తినేయడం బెటర్. అన్నాన్ని మళ్లీ వేడి చేయకూడదు. ఒకవేళ చేసినా అధిక ఉష్ణోగ్రతపై చేయాలి. లేకపోతే బాసిల్లస్ సీరియస్ అనే హానికారమైన బ్యాక్టీరియా వస్తుంది. (foods)
ఆకుకూరలు (leafy greens)
ఆకుకూరల్లో నైట్రేట్లు ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేస్తే విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. వండుకున్నప్పుడే తినేయడం బెటర్.
ఆలుగడ్డ (potatoes)
ఆలుగడ్డలను మళ్లీ వేడి చేస్తే వాటి రుచి మారిపోతుంది. అసలు తినడానికే పనికి రాకుండాపోతాయి. ఒకవేళ వేడి చేయాలనుకుంటే ఓవెన్‌లో పెట్టడం బెటర్.
ప్రాసెస్డ్ మాంసం (processed meat)
అసలు ప్రాసెస్డ్ మాంసాహారాలకే దూరంగా ఉండాలి. అలాంటిది వాటిని మళ్లీ వేడి చేసి తినడం అంటే చావుతో చెలగాటం ఆడినట్లే. (foods)