విషం జ‌ల్లేందుకు వ‌చ్చిన దోమ‌.. ఉద‌య‌నిధిపై BJP కామెంట్స్

AIADMK నేత ఉద‌య‌నిధి స్టాలిన్‌పై (udayanidhi stalin) BJP జాతీయ ప్ర‌జాప్ర‌తినిధి గౌర‌వ్ భాటియా వివాదాస్ప‌ద కామెంట్స్ చేసారు. మొన్న జ‌రిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో (india pakistan match) భాగంగా.. పాకిస్థాన్ ఆట‌గాడు ఔట్ అయితే.. కొంద‌రు భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేసారు.

ఈ ఘ‌ట‌న‌పై ఉద‌య‌నిధి స్టాలిన్ స్పందిస్తూ.. ఆట‌ను ఆట‌లా కాకుండా మ‌త రంగు పుల‌మాల‌ని ఎందుకు చూస్తున్నార‌ని అన్నారు. ఉద‌య‌నిధి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న BJP.. ఇదే ఛాన్స్ అంటూ ఆయ‌న్ను దోమ‌తో పోలుస్తూ కామెంట్స్ చేసారు. ఈ దోమ విషం జ‌ల్లేందుకు సిద్ధ‌మైంది అంటూ గౌర‌వ్ భాటియా కామెంట్స్ చేసారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ మ‌లేరియాల‌తో పోల్చిన ఉద‌య‌నిధిపై BJP పీక‌ల‌దాకా కోపంతో ఉంది. ఎప్పుడెప్పుడు ఉద‌య‌నిధి దొరుకుతాయా ఎప్పుడు కేసులు వేద్దామా అని రెడీగా ఉంది. (udayanidhi stalin)