Joe Biden: ఇజ్రాయెల్ వెళ్లనున్న పెద్దన్న
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) ఇజ్రాయెల్‌కు (israel) వెళ్లనున్నారు. పాలెస్తీనాకు చెందిన హమాస్ (hamas) ఉగ్రవాదులు గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం అందించాల్సిందిగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు (benjamin netanyahu) బైడెన్ సాయం కోరారు.
ఈ యుద్ధం మరిన్ని తీవ్ర పరిణామాలకు దారి తీయకుండా ఉండేందుకు వైట్ హౌస్ తనవంతు సాయం చేయాలనుకుంటోంది. గాజా ఇజ్రాయెల్ వాసులపై దాడికి పాల్పడిన మాట వాస్తవమే కానీ.. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాలని అమాయకు ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడం ప్రధాని బాధ్యత అని బైడెన్ అన్నారు. గాజా వాసులకు ఇజ్రాయెల్ మందులు, నీరు, ఆహారం అందించాలని.. పాలెస్తీనాకు చెందిన ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్‌పై కోపంగా ఉన్నారు అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని తెలిపారు. (joe biden)
గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తమ ఆధీనంలో తీసుకోకుండా పాలెస్తీనా పాలనలో ఉండేలా చర్యలు తీసుకోవడం ఉత్తమమని బైడెన్ అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన పరిణామాలకు గానూ బైడెన్ నేతన్యాహు మధ్య సత్సంబంధాలు కట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం బారిన పడటంతో నేతన్యాహు సాయం కోరగా బైడెన్ మానవత్వంతో కాదనలేకపోయారు. ఈజిప్ట్ కూడా కలగజేసుకుని ఈ యుద్ధానికి ఒక ముగింపు పలికేలా చూడాలని పాలెస్తీనా, ఇజ్రాయెల్ నేతలు రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరోపక్క గాజాను వదిలి వెళ్లిపోతున్న ప్రజల కోసం ఈజిప్ట్ రాఫా సరిహద్దు తెరవాలని అమెరికా కూడా ఆభ్యర్ధించింది. ఈ సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటే నష్టమేమీ లేదని తెలిపింది. మరోపక్క అమెరికా ఇరాన్‌తోనూ చర్చలు జరిపింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాపై యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఇప్పుడే అమెరికన్ మిలిటరీ అవసరం ఇజ్రాయెల్‌కు రాదని బైడెన్ అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు ఎప్పుడు అత్యవసరం ఉన్నా కూడా అమెరికన్ మిలిటరీ సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. (joe biden)