Israel: శత్రువులను ఆదుకోం.. మాజీ పీఎం కామెంట్
ఇజ్రాయెల్‌పై (israel) భీకర దాడులకు పాల్పడిన పాలెస్తీనాలోని హమాస్ సంస్థను అదుపు చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు (benjamin netanyahu) గాజాలో నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసారు. ఈ విషయంపై మాజీ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్‌ను (naftali bennet) స్థానిక జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ.. “” సర్.. నీరు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో గాజాలోని హాస్పిటల్స్‌లో చాలా మంది పేషెంట్లు అల్లాడుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పసికందులు కూడా ఉన్నారు. మరి దీనిపై మీ స్పందనేంటి “” అని ప్రశ్నించారు.
దీనికి బన్నెట్ స్పందిస్తూ.. “” మీకేమైనా పిచ్చా? ఇలా అడుగుతారేంటి? చూసారుగా పాలెస్తీనా, గాజా ఏం చేసిందో. వారే కదా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడింది. ఇది వారు కోరి తెచ్చుకున్నారు. అయినా నా శత్రువులపై జాలి పడి నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాలా? మేం నాజీలపై పోరాటం చేస్తున్నాం. నేతన్యాహు చేసింది 100% కరెక్ట్ “” అని మండిపడ్డారు.