Bone Health: సప్లిమెంట్స్ అవసరం లేకుండా…
ఎముకలు బలంగా మారేందుకు ఎక్కువగా సప్లిమెంట్లపై ఆధారపడుతుంటారు (bone health). వాటి కంటే కొన్ని రకాల జ్యూస్‌లను మన డైట్లో భాగం చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఎముకలను బలంగా మార్చే ఆ పండ్ల రసాలు ఏంటో తెలుసుకుందాం.
*పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలతో తయారుచేసిన డ్రింక్స్ కానీ స్మూతీలు కానీ వారంలో నాలుగు సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
*మటన్ ముక్కలతో చేసిన బోన్ బ్రాత్ (బోన్ సూప్) కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ బోన్ సూప్ తాగినప్పుడు శరీరంలో కొలాజెన్ మెరుగవుతుంది. ఎముకల మధ్య జిగురు బాగా ఉండేందుకు ఈ కొలాజెన్ ఉపయోగపడుతుంది. కొలాజెన్ ఎక్కువగా ఉంటే శరీరం, ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. (bone health)
*టొమాటో రసంలో ఉండే లైకోపీన్ అనే పదార్థం ఎముకలు బలపడేందుకు ఉపయోగపడుతుంది. కానీ టమాటా రసం మితంగా తీసుకోవాలి. ఎందుకంటే టొమాటోల్లో ఉంటే ఆక్సలేట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
*అన్ని రకాల బెర్రీ పండ్లతో తయారుచేసిన స్మూతీలు కూడా ఎముక పుష్ఠిని పెంచుతాయి. ఈ స్మూతీల్లో కాస్త పెరుగు వేసుకుని తింటే మరీ మంచిది. ఎందుకంటే పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుంది.
*నారింజ పండు రసం తాగినా కూడా అద్భతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ డి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
*పాలతో తయారుచేసిన టీలు కాకుండా హెర్బల్ టీలు తాగుతూ ఉండండి. ఎముకల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా నిగనిగలాడుతుంది.
*ఓట్స్, నట్స్‌తో కలిపి స్మూతీ చేసుకున్నా మంచిదే. ఓట్స్‌లో ఉండే ప్రొటీన్ కొత్త కణాలను పుట్టిస్తుంది. (bone health)
*క్రమం తప్పకుండా ఒక గ్లాసు పాలు కూడా తాగడం అలవాటు చేసుకోండి.
మీకు ఏ రకమైన ఆహారంతో అయినా అలెర్జీ వంటి సమస్యలు ఉంటే వాటికి దూరంగా ఉండండి. నిజానికి అన్ని రకాల ఆహార పదార్థాలు మంచివే. అలాగని అన్నీ మనకు పడాలని లేదు కదా..! కాబట్టి ఆహారం విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా చివరికి మీకు ఏది తింటే శరీరం సహకరిస్తోందో అదే తినడం బెటర్. మరిన్ని వివరాల కోసం మీరు వైద్యులను సంప్రదిస్తే మంచిది.