నిమిషంలో ఎన్ని మెట్లు ఎక్కితే ఫిట్‌గా ఉన్నట్లు?
మెట్లు (stairs) ఎక్కడం కూడా వ్యాయామాల్లో ఒక భాగమే. కానీ ఆ మెట్లను ఎలా ఎక్కుతున్నామనేది కూడా ఎంతో ముఖ్యమట. ఎక్కాల్సిన పద్ధతిలో ఎక్కితేనే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అంటున్నారు నిపుణులు.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం.. నిమిషంలో నాలుగు వరసల మెట్లు ఎక్కాలట. అంటే ఒక వరసలో 5 మెట్లు ఉన్నాయనుకోండి.. నాలుగు వరుసల్లో 20 మెట్లు ఉంటే.. వాటిని నిమిషంలో ఎక్కగలిగితేనే సరిగ్గా వ్యాయామం చేస్తున్నట్లు లెక్క. ఒకవేళ మీకు ఈ నాలుగు వరసల మెట్లు ఎక్కడానికి నిమిషానికంటే ఎక్కువ సమయం పడుతుంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
అయితే ఈ రూల్ అన్ని వయసుల వారికి వర్తించదు. 35 ఏళ్ల వరకు వయసు ఉన్న వారికే వర్తిస్తుంది. 35 ఏళ్ల వరకు యంగ్‌గా ఉన్నట్లే లెక్క. ఒకవేళ ఆ మెట్లు నిమిషంలో ఎక్కకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లే. ఒకవేళ నాలుగు వరసల మెట్లను 40 నుంచి 45 సెకెన్లలో ఎక్కేస్తుంటే మీరు సూపర్‌ఫిట్ అని మీ గుండె కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయని అర్థం. (stairs)
మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు
*మీరు రోజూ మెట్లు ఎక్కుతున్నారంటే మీ గుండెకు పనిచెప్తున్నట్లే లెక్క. ఇక్కడ మెట్లు ఎక్కేది మీ కాళ్లు మాత్రమే కాదు మీ గుండె కూడా.
*మీరు ఎక్కే ఒక్కో మెట్టుకి హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దీని వల్ల గుండె కండరాలు సాగడం మెరుగుపడుతుంది. గుండె కండరాలు సాగుతూ ఉంటేనే అది ఆరోగ్యంగా ఉన్నట్లు అని గుర్తుంచుకోండి.
*మెట్లు ఎక్కడం అనేది ఒక ఎరోబిక్ యాక్టివిటీ. మీరు ఎక్కే ఒక్కో మెట్టుతో మీ గుండె ఆరోగ్యం కూడా ఒక్కో మెట్లు మెరుగవుతోందని అర్థం. (stairs)
*తరచూ మెట్లు ఎక్కి దిగుతుండడం వల్ల శరీరానికి కావాల్సిన సగం వ్యాయామం జరుగుతున్నట్లే. బరువు కూడా సులువుగా తగ్గుతారు.
మెట్లు ఎక్కే ప్రొటోకాల్ ఏంటి?
*ముందు వార్మప్ చేయాలి. ఒక పది నిమిషాల పాటు నేలపై అటూ ఇటూ నడవండి.
*6 స్టెప్స్ ఉన్న రెండు మెట్ల వరసలను ఎంచుకోండి. అంటే మొత్తం 12 మెట్లు ఉండాలి.
*ఇప్పుడు ఈ రెండు వరసల మెట్లను వీలైనంత ఫాస్ట్‌గా ఎక్కడానికి ప్రయత్నించండి. (stairs)
*దిగేటప్పుడు కంఫర్టబుల్‌గానే దిగేయండి. మీరు మెట్లు ఎక్కి దిగేటప్పుడు సపోర్ట్ కోసం రెయిలింగ్ సాయం కూడా తీసుకోవచ్చు.
*ఇలా మూడు సెషన్లు చేయాలి. ఒక్కో సెషన్‌కి మధ్య గ్యాప్ 90 సెకెన్లు ఉండేలా చూసుకోండి.
*గ్యాప్ తీసుకోవడం అంటే అలా నిలబడి ఉండటం కాదు. ఈ 90 సెకెన్లు నేలపై అటూ ఇటూ నడవండి.
*ఒక వరసలో 15 నుంచి 20 మెట్ల వరకు ఉండే వాటిపై ఈ క్లైంబింగ్ సెషన్ చేస్తే మరీ మంచిది. కాకపోతే ఈ సెషన్ చేయాలనుకుంటే మీ వయసు, బరువును బట్టి వైద్యుల సలహా తీసుకుని చేస్తే మంచిది.
రిస్క్‌లు కూడా ఉన్నాయ్
మీకు ఆల్రెడీ గుండె సంబంధిత వ్యాధులు ఉంటే ఈ స్టెయిర్ క్లైంబింగ్ చేయకపోవడమే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించకుండా సొంతంగా వ్యాయామాలు అస్సలు చేయకూడదు. (stairs)