Anitha: అమ్మా రోజా.. ఆ వీడియోలు డిలీట్ చేయించుకో
మంత్రి ఆర్కే రోజా (roja) తన గురించి TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ (bandaru satynarayana murthy) మూర్తి చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల కంటతడి పెట్టడంపై TDP నేత వంగలపూడి అనిత (anitha) స్పందించారు.
“” బండారు అన్న మాటల్లో నాకేమీ తప్పు అనిపించలేదు. యూట్యూబ్‌లో చూసిందే ఆయన బయటికి చెప్పారు. కాబట్టి యూట్యూబ్‌లో రోజాకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని డిలీట్ చేయించుకుంటే బాగుంటుంది. ఆ వీడియోలు మేం చూడలేకపోతున్నాం. ఈ దేశంలో మహిళ అంటే కేవలం రోజానే అన్నట్లు ఆవిడ నిన్న గ్లిజరిన్ పోసుకొచ్చి కన్నీళ్లుపెట్టుకుంది. మేం మహిళలం కాదా. YCP బ్యాచ్ మా ఫోటోలు మార్ఫ్ చేసి దరిద్రంగా కామెంట్స్ చేసినప్పుడు ఏమైంది నీలోని ఆడతనం? నువ్వొక్కదానివే మహిళవా? రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడిని పట్టుకుని కామ సీఎం అని అనిందే రోజా. రాజకీయ పార్టీల్లోని ఏ మహిళ కూడా రోజా అంత నీచంగా మాట్లాడలేదు.
అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడింది కూడా రోజానే. వాళ్లు అనే మాటలు నా ఫోటోలను మార్ఫ్ చేసి వేసే జోకుల వల్ల నేను నా పిల్లలు పది రోజుల పాటు టీవీ చూడలేదు. న్యూస్‌పేపర్ చదవలేదు. నేను పది రోజుల పాటు బయటికి రాలేకపోయాను. కుమిలి కుమిలి ఏడ్చాను. కానీ ఏడుస్తూ కూర్చుంటే తప్పదు కాబట్టి పోరాడాలని అనుకున్నాను. నన్ను ఇలా అంటున్నారు సర్ కంప్లైంట్ తీసుకోండి అని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదు తీసుకోకపోగా నా చేతికి ఒక రసీదు ఇచ్చి పంపించారు.
మహిళల గురించి వారి గొప్పతనం గురించి రోజా అన్ని మాటలు మాట్లాడింది. మరి ఆమెకు ఎంతో ప్రియమైన అన్న జగన్ కల్తీ మద్యం అమ్ముతుంటే వేలాది మంది మహిళలు తమ భర్తలను కోల్పోయి ఏడుస్తుంటే మరి వారిని చూసి ఈ రోజా ఎందుకు ఏడవలేదు? వాళ్ల అన్న జగన్‌ను షర్ట్ పట్టుకుని మద్యం దుకాణాలు బంద్ చేయిస్తానని ఇప్పుడు ఎందుక కల్తీ మద్యం అమ్ముతున్నావ్ అని అడిగే ధైర్యం రోజాకు ఉందా?
మీకు వైజాగ్ అంటే ఎంతో ఇష్టం కదా.. రాజధానిని అక్కడికి మార్చాలని అనుకుంటున్నారు కదా. అదే వైజాగ్‌లోని కేజీహెచ్‌కు వెళ్లి అక్కడ మద్యం తాగడం వల్ల అవయవాలు చెడిపోయి రేపో మాపో అన్నట్లుగా ఉన్న ఆ పేషంట్లను చూడటానికి రా. నేనే నిన్ను దగ్గరుండి తీసుకెళ్తాను. ఈ రాష్ట్రంలో మీరు మీ అన్న చేసే పనుల వల్ల ఎంత మంది ఆడవాళ్లు నరకం అనుభవిస్తున్నారో చెప్పడానికి మేం సిద్ధం. మాతో పాటు డిబేట్‌కి రావడానికి మీరు సిద్ధమా?“” అని ఆవేదన వ్యక్తం చేసారు అనిత (anitha)