Tea: చాయ్ కారణంగానే డిప్రెష‌న్..!

చాయ్.. (tea) ఈ ప‌దం విన్న వెంట‌నే ఒక క‌ప్పు తాగేయాల‌ని అనిపిస్తుంది. మ‌న ఇండియాలో చాయ్ ల‌వ‌ర్స్ చాలా మందే ఉన్నారు. ఎంత స్ట్రెస్ ఉన్నా.. ఎంత బాధ‌లో ఉన్నా ఒక క‌ప్పు చాయ్ తాగితే అన్నీ సెట్ అయిపోతాయ్ అనుకుంటాం. కానీ డిప్రెష‌న్ వ‌చ్చేది ఈ చాయ్ వ‌ల్లే అని ఇటీవ‌ల చేసిన ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది.

చైనాకు చెందిన రెండు పాపుల‌ర్ యూనివ‌ర్సిటీలు 5,281 మంది విద్యార్ధుల‌పై ఓ స‌ర్వే చేసారు. వీరిలో రోజూ చాయ్ తాగే వారు అస‌లు తాగ‌ని వారు ఉన్నారు. ప‌రిశోధ‌న‌లో చాయ్ తాగేవారిలోనే యాంగ్జైటీ, డిప్రెష‌న్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ట‌. తాగ‌నివారిలో ఇలాంటి స‌మ‌స్య‌లు క‌నిపించ‌లేద‌ని అంటున్నారు. విన‌డానికే షాకింగ్‌గా ఉంది క‌దూ..! పైగా వీరిలో 77% మంది ఏడాది మొత్తంలో కేవ‌లం 11 కప్పుల చాయ్ మాత్ర‌మే తాగారు. ఏడాదిలో 11 కప్పులు అంటే చాలా త‌క్కువ‌.

అదే మ‌న భార‌త్‌లో అయితే రోజుల‌కు ఐదారు క‌ప్పులు తాగే అల‌వాటు ఉన్న‌వారూ ఉన్నారు. ఇలా ఏడాదిలో 11 క‌ప్పులు తాగిన‌వారిలో విప‌రీత‌మైన డిప్రెష‌న్.. సూసైడ‌ల్ ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయ‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. మ‌న ఇండియాలో లాగే చైనాలో కూడా టీ తాగేవారు చాలా మంది ఉన్నార‌ట‌. 2023 నాటికి చైనాలో 486,000 చాయ్ షాపులు తెరిచిన‌ట్లు తేలింది. (tea)