Roja: బండారు వ్యాఖ్యలపై స్పందించిన రోజా
TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (bandaru satyanarayana) తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై స్పందించారు YSRCP మంత్రి రోజా (roja). ఒక మాజీ ఎమ్మెల్యే.. అధికారంలో ఉన్న మహిళా మంత్రి పట్ల ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటే అతని పెంపకం ఏంటో.. వెనక ఎవర్ని చూసుకుని రెచ్చిపోతున్నారో క్లియర్‌గా అర్థమవుతోందని అన్నారు. భారతదేశంలోని ప్రతి ఒక్క మహిళలను గౌరవించాలని.. అలా చేయనివారికి న్యాయస్థానాలే కఠిన శిక్షలు విధిస్తాయని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బండారు ఇలాంటి వ్యాఖ్యలు చేసారని అన్నారు.
చంద్రబాబు నాయుడు (chandrababu naidu), అతని సతీమణి నారా భువనేశ్వరి (nara bhuvaneswari) నిరాహార దీక్ష గురించి మాట్లాడుతూ.. పిల్లనిచ్చిన కన్నతండ్రిలాంటి మామగారినే చంపేసిన వ్యక్తి.. ఎప్పుడూ హింసా మార్గంలోనే నడిచిన వ్యక్తి ఈరోజు గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షకు కూర్చుంటే గాంధీ ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ఇక నిన్న అవనిగడ్డలో జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) రానున్న ఎన్నికల్లో జగన్ సర్కారుకు 15 చోట్ల సీట్లు వస్తే గొప్ప అని మాట్లాడటంపై రోజా స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 173కి 173 సీట్లు వచ్చే YSRCP ఎక్కడ.. కనీసం 15 మంది ఎమ్మెల్యేలను కూడా పెట్టుకోలేని జనసేన (janasena) ఎక్కడ అని ఎద్దేవా చేసారు. (roja)