Multigrain Rotis మంచివేనా?

ఎప్ప‌టినుంచో న‌డుస్తున్న ట్రెండ్ మ‌ల్టీగ్రెయిన్ రోటీలు (multigrain rotis). గోధుమ పిండితో చేసుకునేవి సాధార‌ణ రోటీలు. వివిధ ర‌కాల పిండ్ల‌తో క‌లిపి చేసుకునేవి మ‌ల్టీగ్రెయిన్ రోటీలు. అస‌లు ఈ మ‌ల్టీగ్రెయిన్ రోటీలు ఎంత వ‌ర‌కు మంచివి?

నిజానికి ఏదైనా ఒక పిండితో మాత్ర‌మే రోటీలు చేసుకోవాలి కానీ ఒకేసారి అన్ని ర‌కాల పిండ్లు క‌లిపి చేసుకునే రోటీలు తిన‌కూడ‌ద‌ని అంటున్నారు పోష‌కాహార నిపుణులు లవ్లీన్ కౌర్. అన్నీ పిండ్లు క‌ల‌గ‌లిపిన రోటీలు తింటే అరుగుద‌ల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అంటోంది. కావాలంటే ఒక రోజు జొన్న‌తో, ఒక రోజు రాగి ఒక రోజు గోధుమ‌లు ఇలా వారంలో మూడు నాలుగు సార్లు వివిధ ర‌కాల పిండ్ల‌తో రోటీలు చేసుకుని తింటే మించిది కానీ.. అన్ని ర‌కాల తృణ‌ధాన్యాలు క‌లిపి ఒకే పిండిలా చేసుకుని రోటీలు చేసుకుంటే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. (multigrain rotis)

మ‌ల్టీగ్రెయిన్ రోటీలు ఎందుకు వ‌ద్దు?

మ‌ల్టీగ్రెయిన్ అంటేనే అన్ని ర‌కాల తృణ‌ధాన్యాలు, సిరి ధాన్యాలు క‌లిపిన పిండి. సాధార‌ణంగా ఒక్కో పిండిలో ఒక్కో శాతం ఫైబ‌ర్ ఉంటుంది. అన్నీ క‌లిపిన పిండ్ల‌లో ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. ఇలా అన్నింటినీ క‌లిపి చేసుకునే రోటీలు తింటే శ‌రీరానికి అందాల్సిన పోష‌కాలు స‌రిగ్గా అంద‌కుండాపోతాయి. ఒక్కో పిండిలో ఒక్కో ర‌కం ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్ అంటే మెట‌బాలిజంను మెరుగుప‌రిచే ఒక ర‌క‌మైన ప్రొటీన్. కాబట్టి ఒక్కో పిండితో ఒక్కో ర‌క‌మైన రోటీ చేసుకుని తింటే వాటి నుంచి అందాల్సిన పోష‌కాలు అందుతాయి. మీకు ఆల్రెడీ జీర్ణ స‌మ‌స్య‌లు ఉంటే మ‌ల్టీగ్రెయిన్ రోటీల‌కు దూరంగా ఉండ‌టం బెట‌ర్.

ప్ర‌కృతి సిరి ధాన్యాల‌ను, తృణ‌ధాన్యాలను ఒక్కొక్క‌టిగా మ‌న‌కు ప్ర‌సాదించింది. కాబ‌ట్టి వాటిని వేరు వేరుగానే తీసుకోవాలట‌. ఒక‌వేళ మీకు మ‌ల్టీగ్రెయిన్ రోటీలు తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మస్య‌లు లేకుండా బాగానే అరుగుతుంటే మీరు అలాగే కొన‌సాగించ‌వ‌చ్చు. పూర్తిగా మ‌ల్టీగ్రెయిన్ రోటీలు మంచివి కావు అని చెప్ప‌డంలేదు. అన్నీ క‌లుపుకుని తినే బ‌దులు ఒక్కో రోజు ఒక్కో ర‌కమైన పిండితో రోటీలు చేసుకుంటే బాగుంటుంది అని నిపుణ‌లు అంటున్నారు.