Ambati Rambabu: డబ్బులుంటే ఓట్లు కొనేస్తావా పవన్..?
డబ్బులుంటే ఓట్లు కొనేస్తావా పవన్ అంటూ జనసేనానిపై షాకింగ్ కామెంట్స్ చేసారు YSRCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu). నిన్న అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ (pawan kalyan) నాలుగో విడత వారాహి యాత్రను (varahi yatra) ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ..నేతలు సన్నాసులని.. తనకు డబ్బు అవసరం లేదు అంటున్నా కూడా ప్యాకేజీ స్టార్ అంటున్నారని మండిపడ్డారు.
దీనిపై అంబటి స్పందిస్తూ… “” ఏవయ్యా పవన్ కళ్యాణ్.. మేమంతా సన్నాసులం అయితే.. నువ్వు సంసారివా? నువ్వు ఎంత గొప్ప సంసారివో అందరికీ తెలిసిందే. అటు రాజకీయంగా BJPతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఎన్నికల్లో TDPతో కలిసి బరిలోకి దిగుతాను అన్నావు. 2024 ఎన్నికల్లో ఏపీలో వచ్చేది జనసేన TDP సంకీర్ణ (హంగ్) ప్రభుత్వమే అన్నావు. మరి BJP పరిస్థితి ఏంటి? BJPని గాలికి వదిలేసావా? నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. అసలు నువ్వెందుకు తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నావో చెప్పు. నాకు డబ్బు అవసరం లేదు అన్నావ్. మరి దేని కోసం తెలుగు దేశంతో పొత్తు? చంద్రబాబు నాయుడు నీతిమంతుడనా? ఒంటరిగా నువ్వు గెలవలేవనా? చంద్రబాబుతో పెట్టుకుంటే నీ బతుకు కూడా గంగపాలే అవుతుందని గుర్తుపెట్టుకో.
నీలాంటి సిగ్గు లేని నైతిక విలువలు లేని వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు పవన్. ప్యాకేజీ కోసం చంద్రబాబు చెప్పులు మోస్తావా? నాదెండ్ల మనోహర్ ఓడిపోయినా ఫర్వాలేదు అనే జనసేనలో చేరారు అన్నావ్. నీకేందుకు మనోహర్ గురించి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనోహర్ కూడా అదే పార్టీలో ఉన్నాడు. ఆ సమయంలో తెనాలిలో ఆయన ఆయన కుటుంబ సభ్యులు ప్రజల నుంచి డబ్బులు ఎలా దోచుకున్నారో తెనాలిలో అడుగు చెప్తారు. జనసేన గెలిస్తే నాలుగు రాళ్లు పోగేసుకుందామని మనోహర్ ప్లాన్‌లో ఉన్నాడు. ఆ విషయం పవన్‌కు అర్థంకావడంలేదు. డబ్బులిచ్చి ఓట్లు అడుక్కునేవాడిని కాను.. డబ్బులు పంచడానికి నా దగ్గర లేవు అన్నావు. అంటే ఉంటే పంచేస్తావా? నువ్వు డబ్బులు పంచి ఓట్లు వేయించుకున్నా గెలిచే ఛాన్సే లేదు. గాంధీ జయంతి రోజున అవినీతి పరులు నిరాహారదీక్ష చేస్తుంటే గాంధీ ఆత్మ క్షోభిస్తోంది “” అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు అంబటి. (ambati rambabu)