నా కొడుకును చంపేయండి.. ఏ లాయర్ వాడి తరఫున వాదించొద్దు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని (ujjain rape) ప్రాంతంలో ఓ బాలికను దారుణంగా రేప్ చేసిన నిందితుడు భరత్ సోనికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు అతని తండ్రి. తన కొడుకు క్షమించరాని నేరం చేసాడని ఏ లాయర్ కూడా వాడి తరఫున వాదించకూడదని కోరుతున్నారు.
జరిగిన కథ
ఇటీవల మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని (ujjain rape) ప్రాంతంలో ఓ బాలిక ఆటో ఎక్కగా.. ఆ ఆటో డ్రైవర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే వదిలేసి వెళ్లిపోగా.. రక్తమోడుతూ సాయం కోసం ఆ బాలిక అన్ని ఇళ్లకు వెళ్లి వేడుకుంది. కొందరు కనికరించలేదు. మరికొందరు కేవలం రూ.50, రూ.100 ఇచ్చి తరిమేసారు. చివరికి ఓ పూజారి బాలికకు దుస్తులు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసి హాస్పిటల్లో చేర్పించారు. ఈ బాలిక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎవరైతే బాలికకు సాయం చేయలేదో వారిపై కేసులు పెట్టబోతున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కనీస సాయం చేయకపోతే ఈ సమాజంలో ఎందుకు బతుకుతున్నట్లు అని మండిపడ్డారు. ప్రతి ఒక్కరి వివరాలు సీసీటీవీలో క్లియర్గా ఉన్నాయని.. ఆ వీడియో ఆధారంగా వారి ఇళ్లకు నోటీసులు వెళ్తాయని పేర్కొన్నారు. (ujjain rape)
ఉరిశిక్ష వేయాల్సిందే
మరోపక్క ఓ బంధువు చూపించిన వీడియో ద్వారా అందులో ఉన్నది తన బిడ్డే అని తెలుసుకున్న ఆ బాలిక తండ్రి నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆ బాలిక చదువు, ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ తానే భరిస్తానని కేసు నమోదు చేసిన అధికారి అజయ్ వర్మ తన పెద్ద మనసును చాటుకున్నారు.