US Government: ష‌ట్‌డౌన్ దిశ‌గా అగ్ర‌రాజ్య ప్ర‌భుత్వం

అగ్ర‌రాజ్యం అమెరికా ప్ర‌భుత్వం (us government) ష‌ట్‌డౌన్ అయ్యే అవ‌కాశం ఉంది. రిప‌బ్లిక‌న్ పార్టీలోని రైట్ వింగ్ నేత‌లు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన తాత్కాలిక బ‌డ్జెట్ అగ్రీమెంట్‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఈరోజు అర్థ‌రాత్రి వ‌ర‌కు తాత్కాలిక బడ్జెట్ విష‌యంలో రాజీకి రాక‌పోతే ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోతాయి. అత్యంత కీల‌క ప్ర‌భుత్వ స‌ర్వీసులు త‌ప్ప మిగ‌తావ‌న్నీ ఆగిపోతాయి. అదే జ‌రిగితే 2019 త‌ర్వాత అయ్యే తొలి ష‌ట్‌డౌన్ ఇదే అవుతుంది.

ష‌ట్‌డౌన్ కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ఫెడ‌ర‌ల్ ఉద్యోగులు, మిలిట‌రీ ఉద్యోగులు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. వీరికి టైంకి జీతాలు పడ‌వు. అమెరికా ప్ర‌భుత్వంలో కాంగ్రెస్ కొన్ని నిర్ణ‌యాల‌ను తీసుకుంటూ ఉంటుంది. ఒక‌వేళ ఆ నిర్ణ‌యాన్ని ఎవ‌రైనా ఒప్పుకోక‌పోతే ఇలాంటి ష‌ట్‌డౌన్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హౌజ్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ (మ‌న‌కు పార్ల‌మెంట్‌లాగా) లో రిప‌బ్లిక‌న్ల‌కు కాంగ్రెస్ తీసుకున్న తాత్కాలిక బ‌డ్జెట్ నిర్ణ‌యం నచ్చ‌లేదు. దాంతో వారు ర‌చ్చ చేస్తున్నారు.

2024లో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇలా అమెరికా ప్ర‌భుత్వం ష‌ట్‌డౌన్ అయ్యే ప‌రిస్థితికి రావ‌డంతో మ‌ళ్లీ డొనాల్డ్ ట్రంపే (donald trump) అధికారంలోకి వ‌స్తార‌ని తెలుస్తోంది. రిపబ్లిక‌న్ల విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ (joe biden) క‌ల‌గ‌జేసుకోవాల‌ని అనుకోవ‌డంలేదు.

రిప‌బ్లిక‌న్ల స‌మ‌స్య‌లు వారే అంత‌ర్గ‌తంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని అప్పుడే ప్ర‌భుత్వం ష‌ట్‌డౌన్ కాకుండా ఉంటుంద‌ని సూచించారు. ఒక‌వేళ ష‌ట్‌డౌన్ అయితే మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా ఉక్రెయిన్‌కు ఇస్తున్న స‌పోర్ట్ కూడా ఆగిపోతుంది. అమెరికా ఉక్రెయిన్‌కు ఇస్తున్న స‌హాయ నిధిని కూడా నిలిపివేయాల‌ని కొంద‌రు రిప్ల‌బిక‌న్లు డిమాండ్ చేస్తున్నారు. (us government)

గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ ఆర్థిక‌వేత్త‌ల ప్ర‌కారం.. అమెరికా ప్ర‌భుత్వం ఒక వారం ష‌ట్‌డౌన్ అయితే.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ 0.2 పాయింట్ల‌కు ప‌డిపోతుంద‌ని అంటున్నారు. ష‌ట్‌డౌన్ ఎత్తివేయాలంటే రెండు నుంచి మూడు వారాల స‌మ‌యం పడుతుంది. అంటే ఎన్ని వారాల పాటు అమెరికా ప్ర‌భుత్వం ష‌ట్‌డౌన్ అయితే ఆర్థిక వ్య‌వస్థ‌కు అంత న‌ష్టం వాటిల్లుతుంది. అత్యంత కీల‌క‌మైన ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ డేటా ప్ర‌చుర‌ణ‌లు కూడా ఈ ష‌ట్‌డౌన్ కార‌ణంగా నిలిచిపోతాయి.

ఈ డేటా ఆధారంగానే వ‌డ్డీ రేట్లు, ఆర్థిక పాల‌సీల‌ను రూపొందిస్తారు. ఈ డేటా ప్ర‌చుర‌ణ కాక‌పోతే అమెరిక‌న్ సెంట్ర‌ల్ బ్యాంకుల‌కు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఇది అగ్రరాజ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను మార్పుకు దారితీస్తుంది. (us government)