Health: రైస్ కంటే రాగి మంచిదా?

మ‌ధుమేహంతో (diabetes) బాధ‌ప‌డేవారికి ఎప్పుడూ ఉండే సందేహం… వైట్ రైస్, బ్రౌన్ రైస్ మంచిదా లేక రాగులు, జొన్న‌లు వంటి ధాన్యాలు మంచివా అని. నిజానికి ఏవైనా ధాన్యాలే. కాక‌పోతే బియ్యంతో పోల్చుకుంటే రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే డాక్ట‌ర్లు కూడా అన్నం మానేసి చ‌పాతీలు తినాలి అంటుంటారు. రాగుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబ‌ట్టి.. అర‌గ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. దాని వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ పెర‌గ‌కుండా ఉంటుంది. అంతేకానీ.. అన్నం కంటే ఇత‌ర తృణ‌ధాన్యాలు, సిరిధాన్యాలు మంచివి అని కాదు. (health)

రైస్ కంటే రాగి బెట‌రా?

రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం 50 ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ శాతాన్ని బ‌ట్టి మ‌నం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ ఎంత త్వ‌ర‌గా ర‌క్తంలో క‌లిసి గ్లూకోస్‌గా మారుతుందో తెలుస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం తక్కువ‌గా ఉంటే అంత నెమ్మ‌దిగా మ‌న ర‌క్తంలోకి కార్బోహైడ్రేట్స్ వెళ్లి గ్లూకోజ్‌గా మార‌తాయ‌ని అర్థం. కానీ వైట్ రైస్, వైట్ బ్రెడ్ వంటి వాటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ పెరుగుతాయి. కాక‌పోతే మ‌నం తీసుకునే ఫుడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. దాని లోడ్ మాత్రం స‌మానంగా ఉండాలి. అంటే మ‌నం తీసుకునే పోర్ష‌న్ కూడా ఎంతో ముఖ్యం. లేక‌పోతే బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు అవుతాయి. (health)

రాగుల్లో ప్రొటీన్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే ఇవి తిన్న వెంట‌నే క‌డుపు నిండిపోయిన‌ట్లు ఉంటుంది. మ‌రో ఆరు ఏడు గంట‌ల వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. రాగుల్లో ఉండే కాల్షియం ఎముక‌లు, కండ‌రాల‌ను బ‌లంగా మారుస్తుంది. అంతేకాదు శ‌రీరానికి కావాల్సిన అన్ని ర‌కాల విట‌మిన్లు, మినర‌ల్స్ రాగుల్లో పుష్క‌లంగా ఉంటాయి. ఇవేవీ తెల్ల బియ్యంలో ఉండ‌వు. అందుకే ఈ విష‌యంలో బియ్యం కంటే రాగులు బెట‌ర్ అంటుంటారు. అలాగ‌ని బియ్యాన్ని తీసిపారేయ‌డానికి లేదు. దంపుడు బియ్యం వండుకుని తింటే రాగుల నుంచి ల‌భించేవి అన్నీ అందుతాయి.

రాగులు ఎప్పుడు తీసుకోవాలి?

రాగుల్లో ఎక్కువ‌గా పీచు శాతం ఉంటుంది కాబ‌ట్టి ఉద‌యాన్నే తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది అరిగేందుకు చాలా టైం ప‌డుతుంది. లంచ్ స‌మ‌యంలో తీసుకునే మ‌రీ మంచిది. రాత్రిళ్లు తీసుకుంటే క‌డుపు కాస్త ఉబ్బ‌రంగా ఉంటుంది. (health)