Vitamin D లెవెల్స్ ఎలా తెలుసుకోవాలి?
శరీరానికి విటమిన్ డి (vitamin d) ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విటమిన్ డి లెవెల్స్ బాగుంటేనే కాల్షియం, ఫాస్ఫరస్ ఒంటికి అందుతాయి. ఇవి ఎముకల్ని దృఢంగా మారుస్తాయి. అయితే విటమిన్ డి లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.
కాసేపు నిలబడినా కాళ్లు నొప్పులు రావడం, సరిగ్గా బాడీని బెండ్ చేయలేకపోవడం విటమిన్ డి లోపానికి సూచన. ఇలా అనిపిస్తే వెంటనే ఒక బ్లడ్ టెస్ట్ చేయించేస్తే సరిపోతుంది. సరిపడా విటమిన్ డి అందుతుంటే ఎలాంటి బాధ లేదు. ఎక్కువగా ఉందంటే మీరు కావాల్సిన దానికంటే ఎక్కువగా సప్లిమెంట్లు తీసుకుంటున్నారని అర్థం. ఒకవేళ తక్కువగా ఉంటే ఉదయాన్నే లేలేత సూర్య కిరణాల్లో కాసేపు నిలబడటం , చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు ఎక్కవగా తింటుండాలి. వీటి వల్ల మనకు నేచురల్‌గా విటమిన్ డి అందుతుంది. ఒకవేళ మరీ తక్కువ స్థాయిలో విటమిన్ డి లెవెల్స్ ఉంటే మాత్రం కచ్చితంగా సప్లిమెంట్స్ వేసుకోవాలి. ఈ సప్లిమెంట్స్ అవసరమో కాదో డాక్టరే వివరింగా చెప్తారు. (vitamin d)