అత్యంత శక్తిమంతమైన పిళ్లాయర్పట్టి కార్పగ గణనాథుడు..!
మనకు దేశవ్యాప్తంగా ఎన్నో గణనాథుడి (lord ganesh) ఆలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తిమంతమైనది పిళ్లాయర్పట్టి (pillayarpatti) ఆలయం. ఈ పిళ్లాయర్పట్టి వినాయకుడి ఆలయం తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన గణేష్ ఆలయాల్లో ఇది ప్రథమ స్థానంలో ఉందని అంటున్నారు. ఈ ఆలయం విశేషాలేంటో తెలుసుకుందాం.
ఇక్కడ వినాయకుడు అర్థపద్మాసనం ఆకారంలో పొట్ట కాలికి తగలకుండా కూర్చుని ఉంటారు. ఈ ఆలయం పూర్తి పేరు పిళ్లాయర్పట్టి కార్పగ వినాయగర్ ఆలయం. కార్పగం అనే వృక్షానికి శాప విముక్తి కలిగించినందుకు ఆయన్ను కార్పగ వినాయకుడు అని పిలుస్తారు. ఇక్కడ గణనాథుడు ఉత్తర దిక్కున దర్శనమిస్తారు. ఈ ఆలయంలో పశుపతీశ్వరుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అప్పట్లో ఒక ఆవు శివుడికి తన పాలతో అభిషేకం చేస్తుండేదట. శివుడు ఆ ఆవుకు మెచ్చి తన చెంతే ఉండాలని వరమిచ్చాడు. అప్పటినుంచి పశుపతీశ్వరుడిగా ఆ గోమాత పూజలు అందుకుంటోంది. ఇక్కడే కుబేరుడి ఆలయం కూడా ఉంది. అంతేకాదు లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి అమ్మవార్లు ఒకే చోట భక్తులకు దర్శనమిస్తారు. (lord ganesh)
ఇదే ఆలయంలో ఉన్న కాత్యాయిని అమ్మవారిని దర్శించుకుంటే పెళ్లికాని ఆడపిల్లలకు త్వరగా వివాహం అయిపోతుందని భక్తుల నమ్మకం. ఇంతకీ ఈ ఆలయానికి పిళ్లాయర్పట్టి అని ఎందుకు పేరు వచ్చిందంటే.. తమిళంలో వినాయకుడిని వినాయగర్ అని పిళ్లయ్యార్ అని సంబోధిస్తారు. 2500 ఏళ్ల క్రితం ఆ ఆలయాన్ని నిర్మించారు.