రాత్రిళ్లు ఆక‌లేస్తే ఏం తినాలి?

రోజంతా ప‌నులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికొచ్చి రాత్రి భోజనం చేసి నిద్ర‌పోతాం (healthy). రాత్రి 10, 11 గంట‌ల స‌మ‌యంలో విప‌రీతంగా ఆక‌లి వేస్తుంటుంది. దాంతో ఇంట్లో ఏది క‌న‌ప‌డితే అది తినేస్తుంటారు. లేదా ఫుడ్ ఆర్డ‌ర్ పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా రాత్రి వేళ‌ల్లో ఏది ప‌డితే అది తిన్నా.. హెవీగా తిన్నా లేని పోని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. రాత్రి వేళ‌ల్లో ఆక‌లేస్తే ఈ కింద చెప్పిన ఫుడ్స్ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. క‌డుపుకి భారంగా అనిపించ‌దు.. ఆరోగ్యంగానూ ఉంటారు.

*మీ ఇంట్లో గ్రీక్ యోగ‌ర్ట్ ఉంటే ఒక క‌ప్పులో వేసుకుని పైన బెర్రీ పండ్లు వేసుకోండి. వీటిలో ప్రొటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి తిన్నాక మ‌ళ్లీ మ‌ళ్లీ ఆక‌లి వేయ‌దు.

*కాటేజ్ చీజ్ (ప‌న్నీరు) కూడా మంచిదే. ఉత్త‌ది తింటే వెగ‌టు ప‌డుతుంది కాబ‌ట్టి ఇంట్లో ఉన్న ఏవైనా పండ్ల ముక్క‌ల‌ను వేసుకోండి. (healthy)

*క్యారెట్, కీరా, టొమాటో ముక్క‌ల‌ను క‌ట్ చేసుకుని పైన పెప్ప‌ర్ పౌడ‌రు చ‌ల్లుకుని తిన్నా కూడా క‌డుపు నిండుగా ఉంటుంది.

*పాప్‌కార్న్ కూడా తినచ్చు. కాక‌పోతే నూనెలో వేయించిన‌వి కాకుండా ఎయిర్ ఫ్రై చేసిన‌వి తింటే బెట‌ర్

*ఒక క‌ప్పు నిండా మీకు న‌చ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినేయండి. క‌డుపు నిండిపోతుంది. (healthy)

*మ‌ల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంటే కాస్త వేయించుకుని దానిపై అవొకాడో ముక్క‌లు వేసుకుని తినేయండి. ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

*ఇక ఏ ఆప్ష‌న్ లేక‌పోతే రెండు గుడ్ల‌ను ఉడికించుకుని ప‌చ్చి సొన‌తో స‌హా తినేయండి. దీనికి మించిన బెస్ట్ ఫుడ్ మరొక‌టి ఉండ‌దు.

*ఓట్స్ ఉంటే కొవ్వు లేని పాలు పోసుకుని రెండు స్పూన్ల తేనె వేసుకుని తిన్నా కూడా మంచిదే.

*యాపిల్స్ ఉంటే వాటిని క‌ట్ చేసుకుని పీన‌ట్ బ‌ట‌ర్‌లో అద్దుకుని తిన్నా స‌రిపోతుంది. (healthy)