ఆదివారం తప్పక జపించాల్సిన మంత్రం
ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించిన రోజు. ప్రతి ఆదివారం సూర్యదేవ మంత్రం (suryadeva mantra) జపిస్తే ఎంతో మంచిది (spiritual). ముఖ్యంగా ప్రాణాయామం, ధ్యానం చేస్తున్న సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే ప్రశాంతతే వేరు. మైండ్ క్లియర్ అవుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఇంతకీ జపించాల్సిన మంత్రాలు ఏంటంటే…
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే
ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవాః జగత్పతే
దీని అర్థం ఏంటంటే.. ఓ సూర్య దేవా.. ఈ బ్రహ్మాండాన్ని నడిపించేది నువ్వే. నాకు ప్రశాంతతను ఇవ్వు. నా మోకాళ్లపై కూర్చుని అర్థిస్తున్నా.. నీ భక్తులకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలిగించు తండ్రీ అని.
ఈ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలు
*ఈ సూర్య మంత్రాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు జపిస్తే సూర్యదేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
*పేదరికాన్ని నిర్మూలించి మంచి జీవితం గడిపేందుకు డబ్బులు సంపాదించుకునేందుకు అవకాశాలను, ఆలోచనలను కల్పిస్తుంది.
*మనిషి రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ ఉంటాడు. కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు.
*ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తాడు. ఓర్పును కూడగట్టుకుంటాడు.
*ముఖ్యంగా ఈ మంత్రం ప్రశాంతతను ఒత్తిడిని తగ్గిస్తుంది.
*ఏకాగ్రత మెరుగవుతుంది. విజయం, జ్ఞానం వాటంతట అవే సిద్ధిస్తాయి.