Ram Gopal Varma: Jr NTR కంటే బ్రాహ్మ‌ణికే పాపులారిటీ ఎక్కువ‌

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) మ‌రోసారి త‌న ట్వీట్‌తో ఆల్రెడీ హాట్ హాట్‌గా ఉన్న రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించారు. TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి (brahmani) త‌న అత్త‌గారు నారా భువ‌నేశ్వ‌రితో (nara. bhuvaneshwari) క‌లిసి రాజ‌మండ్రిలో కొవ్వొత్తుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ బ్రాహ్మ‌ణి గురించి ట్వీట్ చేసారు.

“” బ్రాహ్మ‌ణిగారూ.. మీకు మీ భ‌ర్త కానీ లేక ఇంకెవ‌రైనా కానీ రాజ‌కీయ అంశాల గురించి త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్న‌ట్లున్నారు. కానీ మీరు ద‌య‌చేసి టైం కాని టైంలో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి ఈ బెస్ట్ అవ‌కాశాన్ని వృథాకానివ్వ‌కండి. దీని గురించి మ‌రింత లోతుగా త్వ‌ర‌లో వివ‌రిస్తాను. కానీ నాకు ఒకటి అర్థ‌మైంది ఏంటంటే.. సీనియ‌ర్ NTR త‌ర్వాత ప్ర‌జ‌ల్లో ఇంత‌టి పాపులారిటీ జూనియ‌ర్ NTR కంటే మీకే ఉంది “” అని ట్వీట్ చేసారు.