Suman Bose: అవినీతి జరగనేలేదు.. అన్నీ అబద్ధాలే
స్కిల్ డెవలప్‌మెంట్ (skill development) విషయంలో సీమెన్స్ (siemens) కంపెనీపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు సీమెన్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ (suman bose). స్కిల్ డెవలప్‌మెంట్‌లో మనీ లాండరింగ్ జరిగిందని ఊరికే అలా అనేస్తున్నారని కానీ రెండేళ్లుగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల వల్ల తన కుటుంబం ఎంత బాధపడుతోందో మాటల్లో చెప్పలేనని ఆవేదన వ్యక్తం చేసారు. మర్డర్ జరిగిందని CID ఇన్‌వెస్టిగేషన్ చేస్తోంది కానీ మర్డరర్‌ని పక్కనే పెట్టుకుని వేరే కోణంలో కేసును విచారిస్తోందని AP CID పనితీరుని వివరించారు. (suman bose)
“” రూ.371 కోట్లు డిజైన్ టెక్‌కు లభించగా.. సీమెన్స్‌కు రూ.100 కోట్లు అందింది. ఇది మనీలాండరింగ్ కాదు. మేం చేపట్టిన ప్రాజెక్ట్‌కు మాకు అందిన ఫీజ్. నాపై వస్తున్న ఆరోపణలను తప్పు అని నిరూపించుకోవడానికి నేను సీమెన్స్ లీగల్ సంస్థకు లెటర్ రాసాను. నాకు కావాల్సిన డాక్యుమెంట్లకు యాక్సెస్ ఇవ్వండి నేను ఏ తప్పు చేయలేదని ఆ డాక్యుమెంట్లే ప్రూవ్ చేస్తాయి అని రిక్వెస్ట్ చేసాను. కానీ ఇందుకు సీమెన్స్ ఒప్పుకోలేదు. కారణం నేను సీమెన్స్ సంస్థలో ఇప్పుడు లేనని అంటున్నారు. CID షెల్ కంపెనీలు షెల్ కంపెనీలు అని ఏ కంపెనీలనైతే అంటోందో.. వాటిలో ఉద్యోగులు ఉన్నారు. జీతాలు ఇస్తున్నారు. కొన్నేళ్లుగా అవి నడుస్తున్నాయి. వాటిని షెల్ కంపెనీలు అని ఎలా అంటారు? CIDకి ఆరోపణలు చేసేయడం చాలా సులువు. కానీ నిరూపించాలి కదా..! ఈ ఆరోపణలు సీమెన్స్ సంస్థ వల్ల ట్రైనింగ్ తీసుకున్న రెండు లక్షల విద్యార్థుల జీవితాలపై ప్రభావాలు చూపుతున్నాయి. ఆ పిల్లలు అంత కష్టపడి ఏదో నేర్చుకుని సర్టిఫికేట్లు తీసుకుంటే.. చివరికి ఆ సర్టిఫికేట్లు చెల్లవు అవి ఫేక్ అంటే వారి జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతాయి. “” అని తెలిపారు.
అందుకే సీమెన్స్ నుంచి బయటికి వచ్చేసా
“” నేను సీమెన్స్ నుంచి 2016లోనే తప్పుకోవాలనుకున్నాను. కానీ కంపెనీ నన్ను ఇంకో రెండేళ్లు పనిచేయాలని రిక్వెస్ట్ చేసింది. అందుకే నేను 2018 వరకు ఉన్నాను. ఆ తర్వాత బయటికి వచ్చేసాను. నేను 30 ఏళ్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలకు పనిచేసాను. నేను సీమెన్స్ నుంచి రిజైన్ చేసే సమయానికి నా వయసు 50. ఆ సమయంలో నేను కేవలం డబ్బులు, ప్రాఫిట్స్ కోసమే కాకుండా వేరే ఏదైనా చేయాలని అనుకున్నాను. అందుకే రిజైన్ చేయాలనుకున్నాను. నన్ను సీమెన్స్ ఉద్యోగం నుంచి తీసేయలేదు “”