TDP Janasena: ప‌వ‌ర్ షేరింగ్‌కి ఒప్పుకున్నారా?

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (ap elections) జ‌న‌సేన, TDP క‌లిసి (tdp janasena) పోటీ చేయ‌నున్న‌ట్లు జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. దానికి ఎన్నో లెక్క‌లు ఉంటాయి. పార్టీల నేత‌లు క‌లిసి బాగా చ‌ర్చించుకుని ఓ నిర్ణ‌యానికి వ‌స్తేనే ఆ పొత్తు పండుతుంది. లేదంటే వారిలో వారే కొట్టుకోవాలి. నిన్న రాజ‌మండ్రి జైల్లో జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న చంద్ర‌బాబు నాయుడిని క‌లిసిన త‌ర్వాత ప‌వన్ క‌ళ్యాణ్ పొత్తును ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే రెండున్న‌రేళ్లు సీట్ షేరింగ్‌కి ఒకే అంటేనే పొత్తు అనే విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. ఇందుకు చంద్ర‌బాబు నాయుడు కూడా ఒప్పుకోవ‌డంతోనే ప‌వన్ పొత్తుకు ఓకే అన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. (tdp janasena)