Pawan Kalyan: జగన్ సింహం కదా… సింగిల్‌గానే రమ్మనండి!
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో TDP, జనసేన (janasena) కలిసే బరిలోకి దిగుతుందని కీలక ప్రకటన చేసారు జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan). స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న TDP అధినేత చంద్రబాబు నాయుడిని (chandrababu naidu) కలిసారు పవన్. ఆయనతో పాటు నారా లోకేష్, బాలకృష్ణ కూడా ఉన్నారు. చంద్రబాబుని కలిసారు పవన్ ప్రెస్ మీట్‌లో TDP జనసేన (tdp janasena alliance) పొత్తు ఉంటుందని కీలక ప్రకటన చేసారు. వీలైతే BJP కూడా తమతో కలుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఏపీలో నియంత పాలనను సహించలేమని తెలిపారు. ఎన్నికల్లో ఇరు పార్టీల ఓట్లను చీలనివ్వమని కూడా అన్నారు. (pawan kalyan)
“” లక్షల కోట్లు ఖర్చు పెట్టి సైబర్ సిటీని నిర్మించిన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాక ఇక నాలో సహనం చచ్చిపోయింది. అందుకే రానున్న ఎన్నికల్లో TDPతో కలిసి పోరాడతాను. ఈ విషయం గురించి BJP పెద్దలతో కూడా చర్చించి మాతో చేతులు కలపమంటాను. జగన్‌కు యుద్ధం కావాలంటే మేం కూడా రెడీ. కానీ ఇప్పుడు నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం TDPతో కలవకపోతే మరో 20 ఏళ్ల వరకు ఏపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోతుంది. రాష్ట్ర బాగు కోసం పొత్తుకు సిద్ధమయ్యాను. చంద్రబాబు నాయుడుపై పెట్టింది అక్రమ కేసే. జగన్‌పై కూడా బోలెడు కేసులు ఉన్నాయి కదా? ఏదో ఆయన గతం చాలా క్లియర్‌గా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇక సీట్ల షేరింగ్ విషయం గురించి తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి ఒక కమ్యూనిటీని ఏర్పాటుచేసి ఒక నిర్ణయం తీసుకుంటాయి. గతంలో నేను చంద్రబాబుని విమర్శించి మళ్లీ ఇప్పుడు ఆయనతో చేతులు కలుపుతున్నాను అంటున్నారు. నేను చంద్రబాబుని విమర్శించింది ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయం గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి సామర్థ్యం గురించి కాదు. జగన్ సింహం సింగిల్‌గానే వస్తాడు అని అంటున్నారు. సింగిల్‌గానే రమ్మనండి. “” అని తెలిపారు పవన్.