Supreme Court: నువ్వు చచ్చినా మాకు ఫరక్ పడదు
స్పైస్ జెట్ (spicejet) ఛైర్మన్ అజయ్ సింగ్‌పై (ajay singh) సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. “” నువ్వు చచ్చినా మాకు ఫరక్ పడదు. మర్యాదగా చెల్లించాల్సిన డబ్బు త్వరలో ఇచ్చేయండి. లేదంటే తీహార్ జైలులో ఊచలు లెక్కపెట్టుకోవాల్సి ఉంటుంది “” అంటూ అజయ్ సింగ్‌పై మండిపడింది. అసలు మ్యాటర్ ఏంటంటే… స్పైస్ జెట్ సంస్థ.. గ్లోబల్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ ఏజీ (credit suisse ag) నుంచి కొన్ని మిలియన్ల డాలర్లు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టింది. దాంతో ఆ సంస్థ కోర్టులో కేసు వేసింది. ఇప్పటివరకు ఎన్నో సార్లు వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరికి సహనం కోల్పోయింది. అజయ్ సింగ్ తనపై ఉన్న మరో కేసులో బిజీగా ఉండటంతో కోర్టుకు రాలేకపోతున్నారని అజయ్ తరఫు లాయర్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
దాంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఒళ్లుమండింది. ఎన్ని కేసులు ఉన్నా తమకు అనవసరమని.. త్వరలో స్విస్ క్రెడిట్ సంస్థకు ఎగ్గొట్టిన మిలియన్ డాలర్లతో పాటు 5 లక్షల డాలర్లు మొదటి వాయిదాగా చెల్లించాలని తీర్పు వెల్లడించింది. 2015 నుంచి క్రెడిట్ స్విస్ సంస్థకు స్పైస్ జెట్ సంస్థకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 24 మిలియన్ డాలర్ల వరకు స్పైస్ జెట్ చెల్లించాల్సి ఉంది. ఈ రెండు సంస్థల మధ్య గొడవ మద్రాస్ హైకోర్టుకు చేరింది. 2021లో స్పైస్ జెట్ సంస్థ అన్నీ అమ్మేసి అప్పు తీర్చాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. దాంతో స్పైస్ జెట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పుడు సుప్రీంకోర్టు కేసును పరిశీలించి సంస్థను అమ్మేసే బదులు ఇరు వర్గాలు కూర్చుని చర్చించుకుని ఓ అగ్రీమెంట్‌కి రావాలని కోరింది.
అలా ఇరు సంస్థలు కూర్చుని మాట్లాడుకోగా 3.9 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్విస్ క్రెడిట్ స్పైస్ జెట్‌ను కోరింది. ఇందుకు స్పైజ్ జెట్ కూడా ఒప్పుకుంది కానీ అనుకున్న తేదీకి డబ్బులు చెల్లించలేదు. దాంతో స్విస్ క్రెడిట్ మళ్లీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలో జడ్జిలు అజయ్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. చచ్చినా ఫర్వాలేదు కానీ డబ్బు మాత్రం కట్టి తీరాల్సిందేనని లేదంటే తిహార్ జైలుకు తరలించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. (supreme court)