Weight gain: హెల్తీ ఫుడ్ తింటున్నా లావైపోతున్నారా?

కొంద‌రు ఎంత త‌క్కువ తిన్నా, మంచి హెల్తీ ఆహారం తీసుకున్నా లావైపోతుంటారు (weight gain). మ‌రికొంద‌రు ఎంత ఎక్కువ తిన్నా స‌న్న‌గా నాజూగ్గా ఉంటారు. ఇలాంటి వారికి అదో వ‌రం అనే చెప్పాలి. కానీ పాపం స‌మ‌స్యంతా ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా లావైపోతున్నావారికే. అస‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఎందుకు లావైపోతుంటారు? ఒక‌వేళ మీరు రోజూ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటున్న‌ప్ప‌టికీ బ‌రువు పెరిగిపోతుంటే త‌ప్ప‌కుండా కొన్ని వైద్య పరీక్ష‌లు చేయించుకోవాల‌ని అంటున్నారు వైద్యులు. వాటిలో మొద‌టిది థైరాయిడ్ టెస్ట్ (thyroid test) . థైరాయిడ్ గ్రంథి అస‌మ‌తుల్యంగా ప‌నిచేస్తున్న‌ట్లైతే విప‌రీతంగా బ‌రువు పెరిగిపోతుంటారు. ఐయోడిన్ (iodine) లోపం ఉంటే ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ఇన్సులిన్, గ్లూకోస్ టెస్ట్‌లు కూడా చేయించుకోవ‌డం ఉత్తమం. ఒంట్లోని క‌ణాలు ఇన్సులిన్‌కి రెస్పాన్డ్ అవ్వ‌క‌పోతే బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఫ‌లితంగా ఒంట్లో కొవ్వు పేరుకుపోయి మీరు ఎంత హెల్తీ ఆహారం తీసుకున్నా లావైపోతుంటారు. మ‌న ఒంట్లో హార్మోన్స్ ఇమ్‌బ్యాలెన్స్ అయినా కూడా బ‌రువు పెరిగిపోయే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఒంట్లో హార్మోన్స్ అన్నీ బాగానే ప‌నిచేస్తున్నాయో లేదో తెలుసుకోవ‌డానికి హార్మోన్ ప్యానెల్ టెస్ట్ చేసుకోవాలి. ఈ మూడు టెస్ట్‌ల‌తో పాటు మీ గ‌ట్ హెల్త్ ఎలా ఉందో కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మ‌నం ఏం తిన్నా తాగినా వెళ్లేది క‌డుపులోకే కాబట్టి అక్క‌డ జీర్ణ ప్ర‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతోందో లేదో ప‌రిశీలిస్తారు. (weight gain)