Tea: నెల రోజులు టీ మానేస్తే ఏమవుతుంది?
ఉదయాన్నే కాఫీ, టీ (tea) తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. లేవగానే చాయ్ డోస్ పడకపోతే ఏ పనీ చేయలేం. పైగా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి తలనొప్పి వచ్చేస్తుంది. ఎక్కడలేని చిరాకుతో ఇబ్బందిపడుతుంటారు. మరి ఒక నెల రోజులు టీ తాగకుండా ఉంటే..? అమ్మో ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ..! అసలు నెల రోజుల పాటు టీ తాగకపోతే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా? (tea)
రోజూ టీ తాగే మీరు.. ఒకరోజు తాగకుండా ఉండి చూడండి. బాడీకి కెఫీన్ అందదు కాబట్టి.. టైంకి నిద్ర వచ్చేస్తుంది. అదే నెల రోజులు టీ లేకుండా ఉంటే..? ఇలాంటి ఎన్నో మంచి లాభాలు ఉంటాయి. రోజులో ఒక్కసారి తాగితే ఫర్వాలేదు కానీ.. అదే పనిగా గ్లాసులు గ్లాసులు తాగేస్తుంటే మాత్రం బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అంతేకాదు.. టీ తాగని వారిలో క్యాన్సర్లు వచ్చేలా చేసే ఫ్రీ ర్యాడికల్స్ బాడీలోని సెల్స్ నుంచి రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. (tea)
చాయ్ అంటే డ్రింక్ కాదురా.. ఎమోషన్ అనుకునేవారికి నెల రోజుల పాటు టీ తాగడం మానేయండి అంటే ప్రాణం పోయినట్లు ఉంటుంది. అలాంటివారికి ఒక్క రోజు టీ లేకపోయినా ఏ పనీ చేయలేరు. పైగా రోజంతా డల్‌గా ఉంటారు. టీ తాగాలని ప్రాణం లాగేస్తూ ఉంటుంది. మరి ఈ టీకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అంటే కచ్చితంగా ఉన్నాయి. చాయ్ కాకుండా బ్ల్యాక్ టీ, గ్రీన్ టీని అలవాటు చేసుకోండి. అఫ్‌కోర్స్ వీటికి ఆ చాయ్ టేస్ట్ రాదనుకోండి. కానీ హెల్త్ కూడా ముఖ్యమే కదా..! యాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లు కూడా తాగచ్చు.
ఇక ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు, బాలింతలు కాఫీలు, టీలు తగ్గించేస్తే మంచిది. అది బిడ్డకు అస్సలు మంచిది కాదు. ఎనీమియా ఉన్నవారు టీ జోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే టీలో ట్యానిన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎంత టీ తాగితే.. అంత ఐరన్ లోపిస్తుంది. గుండెదడ ఎక్కువగా ఉన్నవారు కూడా టీని తగ్గించాలి. ఎందుకంటే.. టీ తాగగానే యాంక్జైటీ పెరిగి హార్ట్ రేట్ పెరుగుతుంది. అది మంచిది కాదు. ఇన్ని చెప్పినా కూడా చాయ్ లేకుండా నేను ఉండలేను రా బాబూ.. అనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ను కలవండి. వారు కొన్ని సలహాలు ఇస్తారు. దాని వల్ల మీరే నెమ్మదిగా టీ తాగడం మానేస్తారు.(tea)