Rudraksha ధరిస్తే లాభాలేంటి?

రుద్రాక్ష‌ను చూడగానే మ‌న‌సులో ఏదో తెలీని ప్రశాంత‌త క‌లుగుతుంది. రుద్రాక్ష‌కు (rudraksha) ఉండే శ‌క్తి అలాంటిది. అయితే అస‌లు రుద్రాక్ష మాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.

*ఇంట్లో ఎప్పుడూ క‌ష్టాలు, ప‌రిస్థితులు అనుకూలించ‌న‌ప్పుడు రుద్రాక్ష మాల‌ను ధ‌రిస్తే అన్ని స‌మ‌స్య‌లు తొలిగిపోతాయంటారు. రుద్రాక్ష మాల వేసుకున్నాక మ‌న‌లో ఏదో తెలీని కాన్ఫిడెన్స్ వ‌స్తుంది.

*అనుకోని ఖ‌ర్చుల నుంచి రుద్రాక్ష కాపాడుతుంది. మీకు ఐశ్వ‌ర్యాన్ని క‌లిగించ‌కుండా ఆపే అన్ని ఆటంకాల‌ను తొల‌గిస్తుంది. రుద్రాక్ష వేసుకున్నాక మీరు ఏదైనా మంచి నిర్ణ‌యం తీసుకోవాల‌నుకుంటే ఎలాంటి భ‌యాలు పెట్టుకోకుండా ఆ నిర్ణ‌యాన్ని తీసుకోండి. ఎందుకంటే రుద్రాక్ష విజ‌యానికి సూచికం. (rudraksha)

*న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు, గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను రుద్రాక్ష దూరం చేస్తుంద‌ని న‌మ్ముతారు. న‌ర‌దిష్టి త‌గ‌ల‌కుండా కాపాడుతుంది. అది వేసుకున్న మ‌రుక్ష‌ణం నెగిటివినీ తొల‌గించేస్తుంది.

*కొంద‌రు హైప‌ర్ యాక్టివ్‌గా ఉంటారు. నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు త‌డ‌బ‌డుతుంటారు. రుద్రాక్ష వ‌ల్ల హాయిగా నిద్ర‌ప‌డుతుంది. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. దాంతో మైండ్ క్లియ‌ర్ అవుతుంది. (rudraksha)