Delhi Rape: హాస్పిట‌ల్ ఆవ‌ర‌ణ‌లో ప‌డుకున్న DCW చీఫ్‌

ఢిల్లీ క‌మిష‌న్ ఆఫ్ ఉమెన్ (dcw) చీఫ్ స్వాతి మ‌లివాల్ (swati maliwal) హాస్పిట‌ల్ ఆవ‌ర‌ణ‌లో ప‌డుకుని నిర‌స‌న వ్య‌క్తం చేసారు (delhi rape). రెండు రోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ పోలీసు అధికారి ఫ్రెండ్ కూతురిని రేప్ చేసిన ఘ‌టన వెలుగులోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ట్రీట్మెంట్‌లో ఉంది. అయితే బాధితురాలితో, ఆమె త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడ‌టానికి స్వాతి నిన్న హాస్పిట‌ల్‌కు వెళ్లారు. కానీ అక్క‌డ కాప‌లాగా ఉన్న పోలీసులు ఆమెను లోప‌లికి అనుమ‌తించ‌లేదు. వాళ్లు ఏదో దాచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, త‌న ప‌ట్ల గూండాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్వాతి ఆరోపించారు. బాధితురాలితో మాట్లాడ‌నిచ్చేవ‌ర‌కు అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని స్వాతి హాస్పిట‌ల్ ఎంట్రెన్స్‌లో ప‌డుకుని నిర‌స‌న వ్య‌క్తం చేసారు. (delhi rape)

జ‌రిగిన ఘ‌ట‌న ఇది

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్న బాధితురాలి తండ్రి 2020లో ఓ ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. దాంతో జాలిప‌డి ఆ అమ్మాయి తండ్రికి ఫ్రెండ్ అయిన చైల్డ్ డెవ‌ల‌ప్మెంట్ ఆఫీస‌ర్‌ ప్రేమోద‌య్ ఇంటికి తెచ్చుకున్నాడు. అలా చేర‌దీసిన ఆ వ్య‌క్తే 2020 నుంచి 2021 వ‌ర‌కు ఆమెపై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో ఆ అమ్మాయి గ‌ర్భందాల్చింది. విష‌యం బ‌య‌టికి పొక్కితే ఎక్క‌డ ప‌ర‌వుపోయి త‌న భ‌ర్త ఉద్యోగం పోతుందోన‌ని నిందితుడి భార్య ఎవ్వరికీ తెలీకుండా అబార్ష‌న్ పిల్స్ ఇచ్చి క‌డుపుపోయేలా చేసింది. ఓరోజు ఆ అమ్మాయికి ప్యానిక్ ఎటాక్స్ వ‌స్తున్నాయ‌ని తెలిసి డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ అమ్మాయి త‌న‌కు జ‌రిగిన దారుణం గురించి డాక్ట‌ర్‌కు చెప్ప‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. (delhi rape)