Balakrishna: బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. అయినా పెంచ‌ని ఫీజ్

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ (balakrishna) మంచి మ‌న‌సు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న స్టేజ్‌పై ఏదేదో మాట్లాడేసి పాపం ట్రోల్ అవుతుంటారు కానీ బాల‌య్య బాబు మ‌నసు బంగారం. ఒక్క సినిమాల హిట్ ప‌డ‌గానే కొన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ పెంచేస్తున్న ఈ రోజుల్లో త‌న‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నా కూడా రెమ్యునరేష‌న్‌ను ఏమాత్రం పెంచ‌డానికి బాల‌య్య ఒప్పుకోవ‌డంలేద‌ట‌. ఇప్పుడు ఆయ‌న అనిల్ రావిపూడితో (anil ravipudi) క‌లిసి చేస్తున్న భ‌గ‌వంత్ కేస‌రి (bhagavanth kesari) సినిమాకు కూడా రూ.20 కోట్లే రెమ్యున‌రేషన్ తీసుకున్నారు.

ఇది ఆయ‌న రేంజ్‌కి చాలా త‌క్కువ‌నే చెప్పాలి. భ‌గ‌వంత్ కేస‌రి ముందు ఆయ‌న చేసిన సినిమాల‌కు రూ.15 నుంచి రూ.17 కోట్లు మాత్ర‌మే తీసుకున్నారు. భ‌గ‌వంత్ కేస‌రికి ఇంకో మూడు కోట్లు అద‌నంగా తీసుకుంటున్నారే త‌ప్ప ఒకేసారి 50% పెంచేయ‌డాలు లాంటివి చేయ‌డంలేదు. పెంచితే ఒక‌టో రెండో కోట్లు పెంచ‌మ‌ని అడ‌గాలి కానీ నిర్మాత‌లు భ‌య‌ప‌డి అస‌లు సినిమాలే చేయ‌కూడ‌దు అనుకునేలా రెమ్యున‌రేష‌న్లు డిమాండ్ చేయ‌కూడ‌దు అనేది ఆయ‌న పాల‌సీ. (balakrishna)

నిర్మాత‌లే వచ్చి ఎక్కువ పారితోషికం ఇస్తాన‌న్నా కూడా బాల‌య్య ఒప్పుకోలేద‌ట‌. ఆ డ‌బ్బు ఉంటే మ‌రిన్ని మంచి సినిమాలు తీయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంత డ‌బ్బు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని చెప్తుంటార‌ని బాల‌య్య స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు బాల‌య్య‌ను ఈ విష‌యంలో చూసి నేర్చుకోవాల్సి ఉంది.