AP CM: ముగ్గురివీ మూడు వాద‌న‌లు..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నిక‌ల్లో (ap elections) ఎవ‌రు గెలుస్తారు అనే దానికంటే..గెలిచాక ఎవ‌రు సీఎం (ap cm) అవుతారు అనేదానిపైనే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంది. అధికారిక YSRCP పార్టీని ప‌క్క‌న‌పెడితే.. ప్ర‌స్తుతం మూడు పార్టీలు ఏపీలో అధికారం సాధించాల‌ని అనుకుంటున్నాయి. వాటిలో TDP, జ‌నసేన‌, BJP ఉన్నాయి.ఇక ఈసారి ఒంట‌రిగా పోటీ చేయ‌బోయేది YCP ఒక్క‌టేన‌ని క్లియ‌ర్ అయిపోయింది. జ‌గ‌న్ BJPతో పొత్తు పెట్టుకోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ఆ అవ‌కాశం జ‌న‌సేన‌కు ద‌క్కింది. TDP జ‌న‌సేన (janasena) BJPతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌నుకుంటున్నాయ‌ని ముందు నుంచీ తెలిసిందే. కానీ మ‌ధ్య‌లో BJP TDPకి ట్విస్ట్ ఇచ్చింది. TDPని పక్క‌న పెట్టి జ‌న‌సేన‌ను అక్కున చేర్చుకుంది. (ap cm)

చంద్ర‌బాబే సీఎం: లోకేష్‌

TSPతో పొత్తు BJPకి ఇష్టం లేద‌న్న‌ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలీక‌.. TDP కూడా పొత్తులో భాగం అయితే బాగుంటుంది అని మొన్న మీడియా ముందు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఇక చంద్ర‌బాబు నాయుడు పొత్తు గురించి స్పందిస్తూ.. త్వ‌ర‌లో స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు దాని గురించి మాట్లాడ‌తాన‌ని అన్నారు. చూడ‌బోతే ఈసారి TDP కూడా ఒంట‌రిగానే దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుంది. అందుకే నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో (yuvagalam padayatra) ప‌దే ప‌దే 2024లో సీఎం అయ్యేది చంద్ర‌బాబే అంటున్నారు.

సీఎం ప‌ద‌విపై ఆశ‌ లేదు: చంద్ర‌బాబు

ఓప‌క్క కొడుకు లోకేష్ అలా అంటుంటే.. మ‌రోప‌క్క చంద్ర‌బాబు త‌న‌కు సీఎం ప‌ద‌విపై ఆశ లేద‌ని తెలిపారు. దాదాపు 14 ఏళ్ల పాటు చంద్ర‌బాబు ఏపీకి సీఎంగా ఉన్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేస్తూ.. అన్నేళ్లు సీఎంగా ఉన్నాక ఇక సీఎం ప‌ద‌విపై ఆశ లేద‌ని వెల్ల‌డించారు. మ‌రి ఎందుకు రానున్న ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగాల‌ని అనుకుంటున్నారు అని అడిగితే.. జ‌గ‌న్ రాక్ష‌స పాల‌న‌లో ఏపీ ప్ర‌జ‌లు అల్లాడుతున్నార‌ని వారిని కాపాడుకోవ‌డానికే పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. (ap cm)

ఎన్నిక‌ల త‌ర్వాత సీఎం అభ్య‌ర్ధి నిర్ణ‌యం: ప‌వ‌న్

తండ్రీ కొడుకుల‌ది ఒక మాట అయితే.. పవ‌న్ క‌ళ్యాణ్‌ది మ‌రో మాట‌. ఏపీ సీఎం ఎవ‌రు అనేది ఎన్నిక‌ల త‌ర్వాత ఎమ్మెల్యేలు నిర్ణ‌యిస్తార‌ని స్ప‌ష్టం చేసారు. ఇక పొత్తు BJPతో మాత్ర‌మేనా లేక TDP BJPల‌తోనా అనేది త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని తెలిపారు.