BJP MLA: మణిపూర్ ఘటన అంత ముఖ్యం కాదట
దిల్లీ అసెంబ్లీలో ఓ BJP ఎమ్మెల్యే (bjp mla) మణిపూర్ ఘటన (manipur violence) అంత ముఖ్యమేమీ కాదు అని అనడం రచ్చకు దారితీసింది. అసలే BJP మణిపూర్ ఘటనపై మౌనంగా ఉందని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ (mohan singh bisht) ఈ రకంగా మాట్లాడటంతో ఇతర BJP నేతలు తలపట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యాక ఆప్ (aap) నేత దుర్గేష్ పాఠక్ తనకు ఇచ్చిన కొద్ది సమయంలో మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల గురించి ప్రస్తావించారు. దాంతో అసెంబ్లీలో ఉన్న నలుగురు BJP ఎమ్మెల్యేలు లేచి ఇది దిల్లీ అసెంబ్లీ కాబట్టి దిల్లీ గురించే మాట్లాడాలని అన్నారు.
దాంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా స్పందిస్తూ.. “”మీ ఉద్దేశం ఏంటి? అంటే మణిపూర్ ఘటన ముఖ్యం కాదా? ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీలో కూడా మణిపూర్ గురించి డిస్కస్ చేస్తున్నారు “” అని మందలించారు. దీనికి మోహన్ సింగ్ స్పందిస్తూ.. మణిపూర్ గురించి ఇక్కడ మాట్లాడటం అనవసరం. అయినా అక్కడ జరిగే అంశాలు అంత ముఖ్యం కాదు అనేసారు. దీనికి డిప్యూటీ స్పీకర్.. దిల్లీకి సంబంధించిన చర్చలు అసెంబ్లీలో ఉదయం నుంచి జరుగుతున్నాయ్. మరి మీరు ఏకాగ్రతగా వింటున్నారా? అని అడిగారు. అయినా కూడా డిప్యూటీ స్పీకర్ మాటలు పట్టించుకోకుండా నలుగురు BJP ఎంపీలు కాస్త ఓవర్ చేసారు. దాంతో వారిని బయటికి పంపించాల్సి వచ్చింది.