Puja Room: పూజా మందిరాన్ని ఎలా పెట్టుకోవాలి?
ఇంట్లో ఉండే పూజా మందిరం (puja room) మనకు మరో ఆలయంతో సమానం. అలాంటి మందిరాన్ని ఎలా పెట్టుకుంటున్నాం, ఎలా అలంకరించుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.
పూజా మందిరం ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశ ఎంతో అదృష్టవంతమైనదట. అందుకే పూజా మందిరాన్ని ఆ దిశలో ఉండేలా చూసుకుంటే ఎంతో మంచిది.సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి అదే వైపున కూర్చుని పూజ చేస్తే ఎంతో మంచిది. అదే పడమర వైపు కూర్చుని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయట. ఇక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఉత్తర దిశగా కూర్చుని పూజ చేసుకోవచ్చు. ఈ మూడు దిశల్లో ఏ దిశలోనైనా కూర్చుని పూజ చేసుకోవచ్చు కానీ దక్షిణం వైపు మాత్రం కూర్చుని చేయకూడదు. అది అరిష్టం. (puja room)
పూజా మందిరంలో విగ్రహాలు
ఇక పూజా మందిరంలో ఎలాంటి విగ్రహాలు, ఫొటోలు పెట్టుకోవాలా అన్న విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. మీరు ఎలాంటి దేవుడి విగ్రహాలనైనా పెట్టుకోండి కానీ ఆ విగ్రహాలను నేలకు తాకేలా మాత్రం అస్సలు పెట్టకండి. అది ఇంటికి అస్సలు మంచిది కాదు. కింద ఏదైనా పేపర్ కానీ లేదా పీట కానీ వేసి పెట్టండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. విగ్రహాలపై పూల దండలు వేసేటప్పుడు ముఖాన్ని మాలతో ఎప్పుడూ మూసేయకూడదు. (puja room)
చిన్న విగ్రహాలైతే ఫర్వాలేదు కానీ పెద్ద పెద్ద విగ్రహాలను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. విగ్రహం సైజు 7 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కేవలం పూజా మందిరంలోని విగ్రహాల గురించే. ఇక వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడూ కూడా మెట్ల కింద కానీ.. ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ.. బేస్మెంట్లో కానీ..బాత్రూమ్ దగ్గర కానీ ఉండకూడదు. పూజ మందిరంలో ఎప్పుడూ కూడా అగరబత్తీలు కానీ సెంటెడ్ క్యాండిల్స్ కానీ వెలిగించి ఉంచండి. చాలా పాజిటివిటీ ఉంటుంది. దేవుడి పటాల కింద కానీ విగ్రహాల కింద కానీ ఎర్రటి వస్త్రం వేసి ఉంచండి.
ఇక మీరు మీ పూజా గదిలో గంట పెట్టించుకోవాలనుకుంటే.. ఎడమ వైపు పెట్టించుకోండి. పూజ కోసం ఉపయోగించే కంచాలు వెండి, రాగి, ఇత్తడి, స్టీల్ మెటల్స్వి ఎంచుకోవచ్చు. పూజ గదిలోని నేలపై చక్కగా రంగోలీ వేసి ఉంచండి. ఇప్పుడు స్టిక్కర్లు కూడా దొరుకుతున్నాయ్. వాటిని అంటిచేస్తే ఎంతో కళగా ఉంటుంది. (puja room)
ఎలాంటి రంగులు వేయాలి?
ఇక పూజ గదికి ఎలాంటి రంగులు వేయాలంటే.. తెలుగు, లేత నీలం, ఆరెంజ్, ల్యావెండర్, క్రీమ్, లైట్ ఎల్లో లాంటి రంగులు వేయిస్తే మంచిది. ఏ రంగు వేయించినా కూడా అది డార్క్‌గా కానీ నలుపు, బ్రౌన్ రంగుల్లో మాత్రం ఉండకూడదు.