Independence Day: సెల‌బ్రేట్ చేసుకోలేదు..!

Hyderabad: యావ‌త్ భార‌త‌దేశం 77వ స్వాతంత్ర్య దినోత్స‌వం (independence day) జ‌రుపుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావ‌డానికి కీల‌క పాత్ర‌లు పోషించిన‌ ఎంద‌రో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల్లో మ‌హాత్మా గాంధీ (mahatma gandhi) ఒక‌రు. అయితే 1947 ఆగ‌స్ట్ 15న భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే స్వాతంత్ర్యం వ‌చ్చాక దేశవ్యాప్తంగా సంబ‌రాలు జ‌రుపుకున్నారు. కానీ గాంధీజీ మాత్రం అస‌లు సంబ‌రాలే చేసుకోలేదట‌. పార్ల‌మెంట్‌లో అప్ప‌టి ప్ర‌ధానమంత్రి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప్ర‌సంగం ఇస్తున్నారు అని తెలిసినా గాంధీ మాత్రం వెస్ట్ బెంగాల్ రాజ‌ధాని క‌ల‌క‌త్తాలో ఉండిపోయారు.

గాంధీ క‌ల‌క‌త్తాకు ఎందుకు వెళ్లారు?

1947 ఆగ‌స్ట్ 9న గాంధీ క‌ల‌క‌త్తా వెళ్లారు. అక్క‌డి నుంచి ఆయ‌న నౌఖాలి (ప్ర‌స్తుతం బాంగ్లాదేశ్‌లో ఉంది) వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఆ స‌మ‌యంలో క‌లక‌త్తాలో కుల‌, మ‌తాల‌కు సంబంధించి ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. అక్క‌డ హిందువుల‌ను కాపాడుకునేందుకు గాంధీ కంక‌ణం క‌ట్టుకున్నారు. అదే స‌మ‌యంలో ఈస్ట్ బెంగాల్ కాస్తా ఈస్ట్ పాకిస్థాన్ (ఇప్పుడు బాంగ్లాదేశ్)గా విడిపోయింది. ఈ విష‌యాన్ని గాంధీజీ ముని మ‌న‌వ‌డు తుషార్ గాంధీ ఓ సంద‌ర్భంలో చెప్పారు. (independence day)

అదే స‌మ‌యంలో గాంధీజీని అప్ప‌టి బెంగాల్ నేత, ముస్లిం లీగ్ లీడ‌ర్ హుస్సేన్ షాహిద్ సుహ్రావార్దీ క‌లక‌త్తాలోనే ఉండి ముస్లింల‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌కుండా చూడాల‌ని కోరారు. అందుకు రిటర్న్‌గా హిందువుల‌కు ఏమీ కాకుండా తాను చూసుకుంటాన‌ని చెప్పారు. ఇందుకు గాంధీజీ కూడా ఒప్పుకున్నారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ క‌లిసి హైద‌రి మ్యాన్ష‌న్ (ఇప్పుడు గాంధీ భ‌వ‌న్ అనే మ్యూజియంగా మార్చారు)లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే గాంధీజీ నిర్ణ‌యం కొంద‌రు హిందువుల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు.

ఎందుకంటే హిందూ అయివుండి ముస్లింల‌కు ఎలా స‌పోర్ట్ చేస్తారంటూ మండిప‌డ్డారు. అప్పుడు గాంధీ వారితో ఏమ‌న్నారంటే.. “” నేను నా ప్రాణం అడ్డువేసి మిమ్మ‌ల్ని కాపాడుకోవాల‌ని అనుకుంటున్నాను. అది మీకు న‌చ్చితే నావైపు రండి. న‌చ్చ‌క‌పోతే నాకు వ్య‌తిరేకంగానే నిల‌బ‌డండి. నాకు నా ప్రాణాల‌పై ఆశ లేదు. నా జీవితం ఎప్పుడో అయిపోయింది. నేను ఈ అల్ల‌ర్లు ఆపాల‌ని ముస్లింల‌కు చెప్పాను. అలాగే మీకు కూడా చెప్తున్నారు. ఈసారి న‌ఖౌలీలో మ‌ళ్లీ అల్ల‌ర్లు మొద‌లైతే నా శ‌వాన్ని చూస్తారు “” అని అన్నార‌ట‌. (independence day)

బ‌య‌ట‌ప‌డిన సుహ్రావార్దీ మోసం

అప్ప‌టిదాకా గాంధీజీతో స్నేహంగా ఉంటున్న‌ట్లు న‌టించిన సుహ్రావార్దీనే ఈ అల్ల‌ర్ల‌కు కార‌ణం అని తర్వాత గాంధీకి తెలిసింది. ముస్లింల‌కు ఒక దేశం ఉండాల‌న్న ఉద్దేశంతో దేశాన్ని విభ‌జించాల‌న్న ఉద్దేశంతోనే సుహ్రావార్దీ ఈ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఒప్పుకున్నారు. ఇక స్వాతంత్ర్యం వ‌చ్చిన రోజు గాంధీజీ ప్రార్థ‌న‌లు చేస్తూ, ఉప‌వాసం ఉండి చ‌ర‌కా తిప్పుతూ కూర్చున్నార‌ట‌.అదేంటి బాపూ సెల‌బ్రేష‌న్స్‌కి రాలేదు అని అడిగితే.. ఇలా దేవుడిని ప్రార్థిస్తూ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు చెప్ప‌డంలోనే నా సెలబ్రేష‌న్స్ ఉన్నాయ‌ని అన్నార‌ట‌. (independence day)