Botsa Satyanarayana: సంక్రాంతికి TDP జనసేన ఉండవ్
AP: వచ్చే సంక్రాంతికి TDP, జనసేన (janasena) పార్టీలు ఉండవని, ఒకవేళ ఉంటె గుండు కొట్టించుకుంటానని అంటున్నారు YSRCP మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana). ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటేనే ఏ పార్టీ అయినా నిలబడుతుందని, అలా కాకుండా ఊరంతా తిరుగుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని (jagan mohan reddy) తిడుతుంటే మాత్రం పార్టీలు గల్లంతు అయిపోతాయని అన్నారు. ఇదేదో ఆ పార్టీలపై కోపంతో చెప్పడంలేదని తనకున్న రాజకీయ అనుభవంతో చెప్తున్నానని తెలిపారు.