Pesticide: వీటిలో పురుగుల మందు అధిక‌మ‌ట‌

Hyderabad: పురుగుల మందులు (pesticide) వాడ‌కుండా పంట‌ల్ని పండించ‌డం ఈరోజుల్లో చాలా క‌ష్టం. ఆర్గానిక్ ఫార్మింగ్ (organic farming) అంటారు కానీ వాటిలో 1% అయినా పురుగుల మందు వాడే అవ‌కాశాలు లేక‌పోలేదు. అయితే కొన్ని ర‌కాల పండ్లు, కూర‌గాయ‌ల్లో అధికంగా పురుగుల మందులు వాడి పండిస్తుంటారు. వేటిలో ఎక్కువ‌గా వాడే అవ‌కాశం ఉందో చూద్దాం.

ప్ర‌తి సంవ‌త్స‌రం EWS (ఎన్విరాన్మెంట‌ల్ వ‌ర్కింగ్ గ్రూప్) వారు కొన్ని ర‌కాల పండ్లు, కూర‌గాయ‌ల సాంపుల్స్ తీసుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంటారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఎంత శాతం పురుగుల మందులు వాడారో తెలుస్తుంది. ఎంత శాతం వాడారో తెలుసుకుని దానిని బ‌ట్టి ఆ పంట‌ల‌కు ర్యాంకింగ్ ఇస్తారు. ఈ సంవ‌త్స‌రం టెస్టింగ్ లిస్ట్‌లో కొత్త‌గా రెండు ర‌కాలు చేరాయి, ఒక‌టి బ్లూ బెర్రీస్, మ‌రొక‌టి బీన్స్. పురుగుల మందు ఎక్కువ‌గా ఉండే వాటిలో ఈ ప‌ది ఆహారాలు ఉన్నాయి. (pesticide)

స్ట్రాబెర్రీ (strawberry)

స్ట్రాబెర్రీల‌ను పండించే స‌మ‌యంలో త‌క్కువ‌గా పురుగుల మందు వాడినా కూడా ప్ర‌మాద‌మే. ఎందుకంటే స్ట్రాబెర్రీలు ఉండే తీరు అలాంటిది. పండు బ‌య‌ట గుంత‌లు, ముళ్లు ఉండ‌టం వ‌ల్ల త‌క్కువ‌గా పురుగుల మందు కొట్టినా అది పండు లోప‌లికి వెళ్లిపోతుంది. వీటిపై రెండు ర‌కాల పురుగుల మందు వాడ‌తార‌ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ (usda) చేప‌ట్టిన ప‌రీక్ష‌లో తేలింది.

ఆకుకూర‌లు (leafy vegetables)

ఆకుకూర‌ల‌ను పండించే స‌మ‌యంలో పురుగుల మందుల‌ను ఎక్కువ‌గా కొడుతుంటారు. అందుకే ఆకుకూర‌ల‌ను వండుకునే ముందు ఐదారు సార్లు శుభ్రంగా క‌డుక్కోవ‌డం బెట‌ర్ (pesticide)

పీచ్ (peach)

పీచ్ పండ్ల‌లో కూడా పురుగుల మందులు అధికంగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. దాదాపు 56 ర‌కాల పురుగుల మందులు వాడి మ‌రీ వీటిని పండిస్తార‌ట‌.

పియ‌ర్స్ (pears)

పియ‌ర్ పండులోనూ అంతే. క‌లెక్ట్ చేసిన సాంపుల్స్‌లో 63% పండ్ల‌లో 57 ర‌కాల పురుగుల మందులు ఉన్నాయట‌. (pesticide)

నెక్టారైన్స్ (nectarines)

చూడ‌టానికి పీచ్ పండ్ల‌లాగే క‌నిపిస్తాయి ఈ నెక్టారైన్ పండ్లు. పురుగుల మందుల‌తో కంటామినేట్ అయ్యే పండ్ల‌లో ఇవీ ఒక‌టి. ఇవి మ‌న‌కు ఇక్క‌డ అంత‌గా దొర‌క‌వు కాబ‌ట్టి పెద్ద‌గా ప్ర‌మాదం లేదు.

యాపిల్స్ (apples)

యాపిల్ పండ్ల‌పై ఉండే చ‌ర్మం చాలా ప‌ల్చ‌గా ఉంటుంది. అందుకే పురుగుల మందులు కొట్టినప్పుడు వేగంగా లోప‌లికి వెళ్లిపోతాయి. వీటిని తినే ముందు ఎంత శుభ్రంగా క‌డిగితే అంత మంచిది.

ద్రాక్ష‌ (grapes)

కేవ‌లం ద్రాక్ష‌లోనే కాదు.. దీంతో త‌యారుచేసే వైన్‌లోనూ పురుగుల మందు ఎక్కువ‌గానే ఉంటుంది. (pesticide)

ఎరుపు, ప‌సుపు క్యాప్సిక‌మ్ (red, yellow ball peppers)

మ‌నం ఎక్కువ‌గా గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండే క్యాప్సిక‌మ్ తింటుంటా. ఎరుపు, ప‌సుపు క్యాప్సిక‌మ్‌ల వాడ‌కం త‌క్కువ‌. ఈ రెండు ర‌కాల క్యాప్సిక‌మ్‌ల‌లోనే పురుగుల ముందు ఎక్కువ‌గా వాడుతుంటార‌ట‌.