కోర్టులో రాహుల్ పొగరుగా వ్యవహరించారట..!
Surat: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) కోర్టులో కేసు నడుస్తుంటే పొగరుగా వ్యవహరించారని గుజరాత్ BJP ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ (purnesh modi) ఆరోపించారు. 2019లో కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా రాహుల్.. మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే అని కామెంట్ చేయడంతో ఆయనపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వాదోపవాదాలు అయ్యాక సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
దాంతో ఆయనకు రాజ్యసభలో అనర్హత వేటు పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చిన్న మాటకు రెండేళ్లు జైలు శిక్ష ఎలా విధిస్తారు అంటూ సూరత్ కోర్టులో అభ్యర్ధన పెట్టుకున్నారు. అది చిన్న మాట కాదని ఒక వర్గాన్ని కించపరిచినట్టేనని అభ్యర్ధనను సూరత్ కోర్టు కొట్టిపారేసింది. దాంతో రాహుల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాహుల్ పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టిపారేయాలని పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టుకు లేఖ రాసారు.
“” రాహుల్ అభ్యర్ధనను కొట్టిపారేయాలి. ఎందుకంటే రాహుల్ సూరత్ కోర్టుకి వచ్చినప్పుడు ఆయనకు శిక్ష వేసారని తెలిసి ఎంతో పొగరుగా వ్యవహరించారు. కనీసం పశ్చాత్తాపం కూడా ఆయనలో కనిపించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆయనకున్న ద్వేషం ఏంటో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి క్లియర్‌గా అర్థం అవుతున్నాయి “” అని పూర్ణేష్ మోదీ తెలిపారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. (rahul gandhi)