Tea: సాయంత్రం టీ తాగకూడదా?
Hyderabad: చాయ్ అంటే మన ఇండియన్స్‌కి ఎమోషన్. అందుకే సమయం ఏదైనా చాయ్ (tea) అనగానే రెడీగా ఉంటారు. అందులోనూ వర్షాకాలంలో చాయ్ తాగితే ఆ కిక్కే వేరు. అయితే సాయంత్రం పూట టీ తాగచ్చా? తెలుసుకుందాం.
టీలో కెఫీన్ ఉంటుందని అందరికీ తెలుసు. ఈ కెఫీన్ నిద్ర రానివ్వదు. ఒత్తిడి తగ్గిస్తుంది. అందుకే అలసటగా అనిపించినప్పుడు టీ, కాఫీలు తాగేస్తుంటాం. అయితే నిద్రపోవడానికి 10 గంటల ముందు.. అంటే సాయంత్రం సమయంలో టీ తాగితే రాత్రి సరిగ్గా నిద్రపట్టదని అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. (tea) అంతేకాదు.. సాయంత్రం పూట టీ తాగడం మానేస్తే రాత్రి వేళల్లో లివర్ డిటాక్స్ అవుతుందట. జీర్ణ సమస్యలు కూడా ఉండవని చెప్తున్నారు. మనం పాలల్లో టీ పొడి వేసుకుని చాయ్ ప్రిపేర్ చేసుకుంటాం. దీని వల్ల అందులోని పోషకాలన్నీ పోతాయట. అందుకే చాలా మంది టీ తాగడం మానేయ్యలేక బ్లాక్ టీ తాగుతుంటారు. అయినా కూడా ఫర్వాలేదు టీ తాగకుండా ఉండలేం అనుకునేవారు.. మితంగా తాగితే మంచిది. కొందరు గ్లాసులు గ్లాసులు అలా తాగేస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. (tea)