Rajinikanth: SRH ఆటగాళ్లను మార్చాలి
Chennai: సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లను మార్చాలని అన్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్ (rajinikanth). ఆయన యాక్ట్ చేసిన జైలర్ (jailer) సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిన్న చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. జైలర్ సినిమాను తీసింది సన్ పిక్చర్స్ సంస్థ (sun pictures). ఇదే సంస్థ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు (sun risers hyderabad) ఓనర్. సన్ పిక్చర్స్ సంస్థ అధినేత కళానిధిమారన్ కూతురు కావ్య మారన్ (kavya maaran) సన్ రైజర్స్ టీం (srh) బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. అయితే ఈ టీంలో ఇంకా మంచి ప్లేయర్లు రావాలని నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్‌లో రజినీ అన్నారు. IPL టైంలో సన్ రైజర్స్ ఆడుతున్నప్పుడు కావ్య ఎప్పుడూ డల్‌గా కూర్చుని ఉంటుందని, ఆమెను అలా చూడలేకపోతున్నామని రజినీ మజాక్ చేసారు.
నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఛాన్స్ ఇచ్చిన రజినీ
జైలర్ (jailer) సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ (nelson dileep kumar) డైరెక్షన్ చేసారు. విజయ్, పూజా హెగ్డే యాక్ట్ చేసిన బీస్ట్ సినిమాకు కూడా ఆయనే డైరెక్టర్. కానీ బీస్ట్ (beast) సినిమా డిజాస్టర్. ఆ సినిమాకు అన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా రజినీ దిలీప్‌కు ఛాన్స్ ఇచ్చారు. “” సన్ పిక్చర్స్ ఆఫీస్‌లో నేను దిలీప్ మీట్ అయ్యాం. బీస్ట్ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిసింది. అది విన్నాక అతనితో సినిమా చేయచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది “” అని రజినీ తెలిపారు. (rajinikanth)
ఆ టైటిల్‌తోనే ప్రాబ్లం
ఇకపోతే జైలర్ సినిమాలో హుకుం అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ గురించి రజినీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పాట మొత్తం బాగానే ఉంది కానీ లిరిక్స్‌లో సూపర్‌స్టార్ అన్న పదం ఉందని దానిని తీసేస్తే బాగుంటుందని తెలిపారు. ఆ సూపర్‌స్టార్ అన్న టైటిల్‌తో ఎప్పుడూ ప్రాబ్లమే అని అన్నారు.
కుక్కలన్నాక మొరుగుతాయి
అయితే ఈ ఈవెంట్‌లో రజినీ మరోసారి తనకున్న ఆల్కహాల్ ఎడిక్షన్ గురించి మాట్లాడారు. ఆల్కహాల్ జీవితాలను నాశనం చేస్తుందని యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఓసారి ఈవెంట్ అయ్యాక పీకలదాకా తాగి ఇంటికి వెళ్లాలని, అప్పుడు తన అన్న సెలబ్రేట్ చేసుకోవడానికే కాస్త తాగాలి కానీ దానినే వ్యసనంగా పెట్టుకోకూడదని చెప్పినట్లు ఫ్యాన్స్‌కి మెసేజ్ ఇచ్చారు. ఇక తన గురించి కొన్ని సందర్భాల్లో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి రజినీ మాట్లాడారు. మొరగని కుక్కలు ఉండవు.. విమర్శించని నాలుకలు ఉండవు. ఈ రెండు లేని ప్రదేశాలు ఉండవు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు తలైవా.