Ashwagandha: అశ్వగంధ ఎలా ఉపయోగపడుతుంది?
Hyderabad: అశ్వగంధ.. ఈ ఆయుర్వేద మొక్క మనకు చేసే మేలు చాలానే ఉంది. ఎలా తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి అనేది తెలిస్తే.. ఈ అశ్వగంధ (ashwagandha) మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా కాపాడుతుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది
ఒత్తిడిని తగ్గించే శక్తి అశ్వగంధకు ఉంది. కానీ అలా ఒక స్పూన్ తినగానే వెంటనే రిజల్ట్ చూపించడానికి ఇది ట్యాబ్లెట్ లాంటిది కాదు కాబట్టి.. నెమ్మదిగా తీసుకుంటూ ఉంటే దాని పవర్‌ను చూపిస్తూ ఉంటుంది.
బ్లడ్ షుగర్, కొవ్వు తగ్గిస్తుంది
ఈ రెండు మనిషికి అతిపెద్ద శత్రువులు. అశ్వగంధ బ్లడ్ షుగర్, కొవ్వుని తగ్గించడంలోనూ సాయపడుతుంది. బ్లడ్‌లో ఉండే కొవ్వుని ట్రై గ్లిసరైడ్స్ (triglycerides) అంటారు. ఎన్నో రకాల గుండె సమస్యలు రావడానికి ఈ బ్లడ్ ఫ్యాటే కారణం. దానిని తగ్గించే శక్తి అశ్వగంధకు (ashwagandha) ఉంది.
కండరాలు బలంగా మారతాయి
అశ్వగంధను రెగ్యులర్‌గా తీసుకుంటే కండరాలు ఎంతో బలంగా మారతాయి. వాటి నొప్పులు కూడా తగ్గిపోతాయి.
టెస్టోస్టిరోన్ లెవెల్స్ పెరుగుతాయి
శృంగారంపై అనాశక్తి ఉన్న మగవారు ఈ అశ్వగంధను తీసుకుంటే శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్స్ పెరిగి సంతానలేని సమస్యలను తొలగిస్తుంది.
మెమొరీ పవర్ బాగుంటుంది
అశ్వగంధ క్రమం తప్పకుండా తీసుకునే వారిలో మెమొరీ పవర్ బాగా పెరిగినట్లు ఓ రీసెర్చ్‌లో కూడా తేలింది.