CPI Narayana: ప‌రువు లేని ప్ర‌భుత్వం.. పవ‌న్‌పై ప‌రువు న‌ష్టం

AP: జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) మీద పరువు నష్టం దావాను ఖండించారు సీపీఐ నారాయ‌ణ‌ (cpi narayana). పరువు లేని YSRCP ప్రభుత్వం.. పవన్ కల్యాణ్ మీద పరువు నష్టం దావా వేయడం చూస్తే నవ్వి పోదురు గాక నాకేటి అన్నట్టుందని విమ‌ర్శించారు. బహిరంగ సభలో మాటలు వాడిగా వేడిగా వస్తాయని, ఆ మాట‌లన్నింటిపై కేసులు పెట్టుకుంటూ పోతే YSRCP నాయకులు సగం మందికి పైగానే పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిర‌గాల‌ని మండిప‌డ్డారు.