Devara: అల్లు అర్హ‌ కీ రోల్?

Hyderabad: శాకుంత‌లం (shaakuntala) సినిమాతో త‌న‌లో ఒక బుల్లి సూప‌ర్‌స్టార్ ఉంద‌ని ప్రూవ్ చేసేసింది అల్లు ప్రిన్సెస్ అల్లు అర్హ‌ (allu arha). ఇప్పుడు యంగ్ టైగ‌ర్ NTR న‌టిస్తున్న దేవ‌ర (devara) సినిమాలో అర్హ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) ఫ్యాన్స్, ఇటు యంగ్ టైగ‌ర్ NTR ఫ్యాన్స్‌కి వీరిద్ద‌రూ ఒక సినిమాలో క‌లిసి న‌టిస్తే చూడాలని ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే వీరిద్ద‌రినీ ఒకే సినిమాలో చూడ‌టం కుద‌ర‌దు. అల్లు అర్జున్ లేక‌పోతేనేం.. ఆయ‌న వార‌సురాలు అల్లు అర్హ ఎన్టీఆర్‌తో (jr ntr) క‌లిసి కొన్ని సీన్ల‌లో న‌టించ‌బోతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఆల్రెడీ అల్లు అర్హ (allu arha) ఒక బార్న్ యాక్ట‌ర్ అని స‌మంత చెప్పేసింది. శాకుంత‌లం సినిమా స‌మ‌యంలో కూడా జ‌స్ట్ డైలాగులు పేప‌ర్‌లో రాసి ఇస్తే ఒకటికి రెండు సార్లు చ‌దువుకుని సింగిల్ టేక్‌లో డైలాగులు ట‌క‌టాకా చెప్పేసింద‌ట‌. ఇక దేవ‌ర‌లో (devara) అర్హ‌కు ఎలాంటి రోల్ ఇవ్వ‌బోతున్నారో అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇస్తే కానీ తెలీదు.