Early Dinner: ఎందుకు త్వరగా డిన్నర్ చేసేయాలి?
Hyderabad: పొద్దున నుంచి ఏం తిన్నా తినకపోయినా రాత్రి మాత్రం త్వరగా తినేయమంటుంటారు (early dinner). ఇందుకు కారణం లేకపోలేదు. రాత్రి త్వరగా తినేసి పడుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. రాత్రి 8 లోపు డిన్నర్ (early dinner) చేసేస్తే బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు రాత్రి త్వరగా తినేస్తేనే బెటర్. లేదంటే మీరు ఉదయం లేచి ఎంత వ్యాయామం చేసినా వేస్టే.
అదే త్వరగా డిన్నర్ పూర్తిచేసేసుకుని కాసేపు పోస్ట్ మీల్ వాక్ చేసారునుకోండి పది, పదకొండు గంటల ప్రాంతంలో ఆకలి అనేది వేయదు. అప్పటికే మంచి నిద్రలోకి జారుకుంటారు. తొందరగా డిన్నర్ (dinner) చేయడం ద్వారా అరగిపోతుంది కాబట్టి నిద్ర కూడా బాగా పడుతుంది. బ్లడ్ ప్రెషర్ (blood pressure) కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి గుండెకు (heart) సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయట.
కాకపోతే త్వరగా డిన్నర్ చేయమన్నారు కాదా అని ఏది పడితే అది ఎక్కువగా తినేయకండి. మితంగా తినండి. అది కూడా రాత్రివేళల్లో ఏవి తింటే అరుగుతుందో అవే తినడానికి ప్రయత్నించండి. త్వరగా తినేసాం కదా అని వెంటనే పడుకోవద్దు. ఇది ఇంకా ప్రమాదం. ఒక పది నిమిషాలు వాకింగ్ చేయండి. అప్పుడు డైజెషన్ ప్రాసెస్ (digestion) సులువు అవుతుంది. ఒక వారం రోజులు ఇలా త్వరగా తినేసి పోస్ట్ మీల్ వాక్ చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలిసిపోతుంది.